టాలీవుడ్ లో ఫ్యామిలీ కథలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ప్రస్తుతం తమిళ సినిమా ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ అడ్డాలను ‘కర్ణన్’ రీమేక్ కు దర్శకుడిగా తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ ఈ విషయంపై ఆయన ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.
కాగా, రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నుండి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేయమని చెప్పారట దిల్ రాజు. ‘వకీల్ సాబ్’ సినిమా తరువాత పవన్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు దిల్ రాజు. అందుకే ఇప్పుడు దర్శకుల కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో తన బ్యానర్ లో రెండు సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాలను పవన్ కు కథ చెప్పమని అడిగారట.
అయితే శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడొక సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. గతంలో గీతాఆర్ట్స్ నుండి భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. ‘నారప్ప’ తరువాత తమ బ్యానర్ లో సినిమా చేయమని గీతాఆర్ట్స్ సంస్థ అడుగుతోంది. ఇదే విషయాన్ని శ్రీకాంత్ అడ్డాల.. దిల్ రాజుకి చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో శ్రీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. చూస్తూ చూస్తూ పవన్ తో సినిమా ఛాన్స్ అయితే వదులుకోలేడు కదా!
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!