Srikanth, Jagapathi Babu: ‘గేమ్ ఛేంజర్’, ‘పుష్ప 2’..ఇవి గమనించారా?

జగపతి బాబు (Jagapathi Babu) , శ్రీకాంత్ (Srikanth) .. ఒకప్పుడు హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. వరుసగా ఫ్యామిలీ సబ్జెక్టుల్లో, ప్రేమకథల్లో హీరోలుగా చేసి.. లేడీ ఫ్యాన్స్ ను బాగా సంపాదించుకున్నారు. అయితే కొత్త హీరోల దూకుడుకి వీళ్ళు వెనుకబడ్డారు. వెంటనే కోలుకుని.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా చేస్తూ మళ్ళీ బిజీ అయ్యారు. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న తెలుగు ఆర్టిస్టులు తక్కువైపోయిన ఈ రోజుల్లో.. ఈ సీనియర్ స్టార్ హీరోలకి పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

Srikanth, Jagapathi Babu

ఇటీవల రిలీజ్ అయిన ‘దేవర’ (Devara) లో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడు. అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో కూడా ఇతని పాత్ర ఊహించని విధంగా ఉంటుంది అంటూ మొదటి నుండి హింట్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఇతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బొబ్బిలి సత్యమూర్తి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పెద్ద రాంచరణ్ (Ram Charan)  స్నేహితుడిగా మొదట్లో ఇతను కనిపిస్తాడట.

ఆ తర్వాత అతనికి వెన్నుపోటు పొడిచి మెయిన్ విలన్ అవుతాడని తెలుస్తుంది. టీజర్లో శ్రీకాంత్ లుక్ కూడా కొత్తగా అనిపించింది. గతంలో అతను ఇలా కనిపించింది లేదు. మరి ఈ పాత్రలో శ్రీకాంత్ నటన ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక జగపతి బాబు కూడా ‘సలార్’ (Salaar) వంటి పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ‘పుష్ప 2’ (Pushpa 2) ట్రైలర్లో జగపతి బాబు కొత్తగా కనిపించి షాక్ ఇచ్చారు.

కోగటం వీర ప్రతాప్ రెడ్డి అనే పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నారు. ‘డబ్బు అంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. వీడిలో తెలియని బాధ ఏదో ఉంది’ అంటూ ఆయన పలికిన డైలాగ్ కూడా హైలెట్ అయ్యింది. చూస్తుంటే ‘పుష్ప 2’ కథలో జగపతి బాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందేమో అనిపిస్తుంది..! ఏదేమైనా శ్రీకాంత్, జగపతి బాబు..ల కొత్త లుక్స్ అందరి అటెన్షన్ ను డ్రా చేశాయి అని చెప్పాలి.

‘పుష్ప 2’.. ‘బాహుబలి 2’ రికార్డు టార్గెట్టుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus