‘అఖండ’ చిత్రంతో మళ్ళీ విలన్ గా మారాడు శ్రీకాంత్. ఈ మూవీలో అతని పాత్ర అందరినీ భయపెట్టేలా ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇందులో శ్రీకాంత్ కనిపించాడు. అయితే అతన్ని సెకండ్ విలన్ గా చూపించడం కొంతమందికి నచ్చలేదు. అయినప్పటికీ వరదరాజులు పాత్ర అతనికి హై ఇచ్చింది అనేది వాస్తవం. ప్రస్తుతం అతను శంకర్- చరణ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ చిత్రంలో తన పాత్ర గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.
ఆయన మాట్లాడుతూ.. “నేను విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను.. తర్వాత హీరోగా చేశాను.. మధ్యలో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను. ఇమేజ్ మార్కెట్ గురించి ఆలోచించకుండా నేను అన్ని రకాల సినిమాల్లో ఉండడానికి ఇష్టపడతాను. ‘సరైనోడు’ లో నేను బాబాయ్ క్యారెక్టర్ చేశాను. సినిమా హిట్ అయ్యింది. ఆ టైములో బోయపాటి గారు నువ్వు విలన్ గా చేస్తాను అంటే నేను నీకోసం మంచి పాత్ర డిజైన్ చేస్తాను.
ఏది పడితే అది చేయకు అని నాతో అన్నారు. కానీ నేను ‘యుద్ధం శరణం’ అనే సినిమా చేశాను. అది అంతగా ఆడలేదు. కానీ ఓటిటిలో రిలీజ్ అయ్యాక దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత నేను ఏ సినిమా చేయలేదు. ‘ అఖండ’ లో నేను చేస్తున్నప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. కానీ నా గెటప్ చూసుకున్నాక నమ్మకం వచ్చింది. అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ నమ్మకం మరింత బలపడింది.
ఇప్పుడు శంకర్- చరణ్ కాంబోలో చేస్తున్న మూవీలో కూడా నా లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏంటి ఇతను శ్రీకాంతా? అనేలా ఉంటుంది ఆ పాత్ర” అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.