Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి ఇప్పటికైనా క్లిక్కయ్యేనా.. ఆశలన్నీ నానిపైనే..!

కేజీఎఫ్ (KGF) మూవీతో సౌత్ సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన శ్రీనిధి శెట్టి  (Srinidhi Shetty)  , తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లోనే ఇద్దరు స్టార్ హీరోలు యష్ (Yash), విక్రమ్ (Vikram) సరసన నటించినా, ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కేజీఎఫ్ సిరీస్ రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్స్ అయినా, శ్రీనిధికి మాత్రం ఆ ఫాలోఅప్ పెద్దగా కుదరకపోవడం ఆశ్చర్యమే. కోబ్రా సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో ఆమె కెరీర్ కాస్త వెనుకబడినట్టే అయ్యింది.

Srinidhi Shetty

ఇప్పుడు మాత్రం ఆమె టాలీవుడ్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. నాని  (Nani)  నటిస్తున్న ‘హిట్ 3’ (HIT 3)  సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను  (Sailesh Kolanu)   దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ట్రైలర్‌లోనే శ్రీనిధి గ్లింప్స్ కొద్దిగా కనిపించినా, కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్నట్టు టాక్.

ఇక నాని అంటే మంచి క్రేజ్, హిట్ ఫ్రాంచైజీకి ఇప్పటికే వర్కౌట్ అయిన ఫార్ములా. మే 1న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అయితే, ఆ క్రెడిట్‌లో శ్రీనిధికీ మంచి పీక్చర్ వస్తుందని ఆశిస్తున్నారు. ఆవిడకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలంటే, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావడమే కీలకం. ఇకపోతే, ‘తెలుసు కదా’ అనే మరో మూవీతో కూడా శ్రీనిధి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అది నానికంటే ముందుగా రిలీజ్ అవుతుందా లేక తర్వాతా అనేది ఇంకా క్లారిటీ లేదు.

అయితే ‘హిట్ 3’ ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం, అటు హీరో నానీ క్రేజ్.. ఇటు హార్డ్ హిట్టింగ్ స్క్రీన్‌ప్లే కలిసి ఈ అమ్మడికి లైఫ్ లైన్ ఇవ్వొచ్చన్న నమ్మకం పరిశ్రమలో ఉంది. మొత్తానికి శ్రీనిధి శెట్టి ముందు ఇప్పుడు బిగ్ టెస్ట్ ఉంది. స్టార్‌డమ్ తో ఆరంభమైన కెరీర్‌కు నేడు గట్టిగా నిలబడి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ‘హిట్ 3’ ఆమెకు టాలీవుడ్‌లో వరుస ఛాన్స్‌లు తెచ్చిపెట్టే టైటిల్ అవుతుందా అన్నది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus