గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది ‘రామాయణ’ లాంటి పెద్ద సినిమాను ‘కేజీయఫ్’ (KGF) భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) వదులుకుంది అనేది ఆ రూమర్ల సారాంశం. అంత పెద్ద వదులుకోవడం, ఆ విషయం ఆమెనే చెప్పింది అనడంతో ఆ విషయం వైరల్‌గా మారింది. మరి నిజంగానే ఆమె ఆ సినిమాను వదలుకుందా అనే చిన్న డౌట్ చాలామంది మనసులో ఉండే ఉంటుంది. అలా డౌట్ పడినవాళ్లకు క్లారిటీ వచ్చేసింది.
మీరు డౌట్ పడిన మాట వాస్తవమే. అంత పెద్ద సినిమా అవకాశం ఆమెకు వస్తే వదులుకోలేదు. టీమే ఆమెను ఎంపిక చేయలేదు. ఈ మాటను ఇప్పుడు క్లియర్‌గా శ్రీనిధి శెట్టినే చెప్పుకొచ్చింది. ‘రామాయణ’ సినిమాను తాను వదులుకోలేదని, ఆ సినిమా విషయంలో తాను చెప్పింది మీడియాలో మరో రకంగా వెళ్లిందని క్లారిటీ ఇచ్చింది. తాను సీత పాత్రను వద్దనుకున్నాన్నది నిజం కాదని, అలాంటి గొప్ప పాత్రను వద్దనుకోవడాని అసలు తానెవరు అని తిరిగి ప్రశ్నించింది శ్రీనిధి.
‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాను అనే మాట ఒక్కటే నిజమని తేల్చి చెప్పింది. తనతోపాటు సాయిపల్లవి (Sai Pallavi) , ఆలియా భట్ (Alia Bhatt) లాంటి వాళ్లు కూడా ఆడిషన్‌కు వచ్చారని.. ఆఖరికి సాయిపల్లవి ఓకే అయింది అని శ్రీనిధి క్లారిటీ ఇచ్చింది. అంత పెద్ద పాత్ర కోసం ఆడిషన్‌కు పిలవడమే నాకు పెద్ద విషయం అని కూడా చెప్పింది. ఆడిషన్‌కి వెళ్లి వచ్చిన తర్వాత టీమ్ నుండి సమాచారం రాలేదని మాత్రం చెప్పింది.
అంటే సెలక్ట్ అవ్వన్నట్లు కూడా సమాధానం రాకపోవడం ఏంటి అనేది మరో చర్చ. శ్రీనిధి శెట్టి ప్రస్తుతం నేను తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తోంది. ‘జాక్’ సినిమా తర్వాత సిద్ధు నుండి రానున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చాలా హైలో ఇన్నాళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు కాస్త లోలో ఉంది అంటున్నారు. కారణం ‘జాక్’ (Jack) రిజల్ట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.