Srinu Vaitla: ‘మీరు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను’.. శ్రీనువైట్ల పోస్ట్!

దర్శకుడు శ్రీనువైట్ల టాలీవుడ్ లో ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించారు. ఆయన తీసిన ‘ఆనందం’, ‘సొంతం’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్ షా’ ఇలా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన రూపొందిస్తోన్న సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. దీంతో సక్సెస్ కోసం పరితపిస్తున్న ఈ దర్శకుడు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ దర్శకుడికి వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.

శ్రీనువైట్లతో విడాకులు తీసుకోవడానికి అతడి భార్య కోర్టుకెక్కింది. దాదాపు నాలుగేళ్లుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. అయితే పిల్లల కోసం విడాకులు తీసుకోరని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా శ్రీనువైట్ల భార్య రూపా విడాకులు కావాలంటూ కోర్టుని ఆశ్రయించింది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ జంటకు విడాకులు మంజూరు చేయనుంది కోర్టు. ఇదిలా ఉండగా.. దర్శకుడు శ్రీనువైట్ల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

‘జీవితం చాలా అందమైంది. మనం ప్రేమించిన వాళ్లతో ఉంటే అది ఇంకా అందంగా ఉంటుంది. మీ ముగ్గురూ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను’ అంటూ తన కూతుళ్లతో తీసుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. శ్రీనువైట్ల ఇంత ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.

బాధపడకండి సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచి కం బ్యాక్ ఇస్తే అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీనువైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మంచు విష్ణు హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus