Srinu Vaitla: సీక్వెల్‌ కాదు.. సీక్వెల్‌ రాదంటున్న శ్రీను వైట్ల

ఓ రకమైన కామెడీ సినిమాలతో టాలీవుడ్‌ను కొన్నేళ్లు ఏలేశాడు శ్రీను వైట్ల. ఒక బకరాను పట్టుకొని… అతని చుట్టూ కథను తిప్పడం ఆ రకం కామెడీ స్టైల్‌. వరుసగా అలాంటి సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధించారు శ్రీను వైట్ల. అయితే ఒకే రకం సినిమాలు చూసి ప్రజలు ముఖం మొత్తిందేమో, వరుస పరాజయాలు అందుకున్నారు. అయితే కొంచెం పెద్ద గ్యాపే తీసుకొని ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నారు. అదే మంచు విష్ణు సినిమా ‘ఢీ అంటే ఢీ’. ఈ సినిమా ప్రారంభించిన రోజునే… ఇది ‘ఢీ’కి సీక్వెల్‌ కాదని చెప్పారు. అయినా ఇంకా పుకార్లు ఆగలేదు. దీంతో మరోసారి క్లారిటీ ఇచ్చారు శ్రీను వైట్ల. దీంతోపాటు మరికొన్ని క్లారిటీలు కూడా ఇచ్చేశాడు.

‘ఢీ అంటే ఢీ’ పూర్తి కొత్త కథ. గతంలో వచ్చిన ‘ఢీ’కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ సినిమా ఫ్లేవర్‌ కనిపిస్తుంది అంతే. అందులోని పాత్రలు, పాత్ర నైజాలను ఈ సినిమాలో చూపించడం లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతోపాటు చాలా రోజులుగా వినిపిస్తున్న ‘దూకుడు’ సినిమా సీక్వెల్‌ గురించి కూడా ఓ మాట చెప్పేశాడు. చాలా మంది చెబుతున్నట్లుగా ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలని అనుకోవడం లేదట. ‘దూకుడు’ సినిమా మంచి విజయం సాధించింది. నా కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచింది. అయినా సీక్వెల్‌ చేసే ఆలోచన లేదు అని చెప్పారు శ్రీను వైట్ల.

మరోవైపు శ్రీను వైట్ల ‘డబుల్స్‌’ అనే ఓ మల్టీ స్టారర్‌ సినిమా కథ రాసుకున్నారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమాను చిరంజీవి, మహేష్‌బాబుతో చేయాలని చూస్తున్నారు అని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి చర్చలు కూడా సాగాయని అనుకున్నారు. అయితే ఆ సినిమా చేయడం మాత్రం పక్కా అని, కానీ చిరంజీవి, మహేష్‌బాబుతో చేస్తాను అనడం మాత్రం కరెక్ట్‌ కాదని చెప్పారు. ‘ఢీ అంటే ఢీ’ తర్వాత వేరే సినిమా చేశాక, అప్పుడు ‘డబుల్స్‌’ పని మొదలుపెడతారట శ్రీను వైట్ల. అంటే హిట్‌ ట్రాక్‌ ఎక్కాక మల్టీ స్టారర్‌ పనులు మొదలెడితే పెద్ద హీరోలు ఓకే చెబుతారని అనుకుంటున్నారేమో.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus