Srinu Vaitla, Rajasekhar: శ్రీను వైట్ల – రాజశేఖర్‌ కాంబో మిస్‌ అయ్యాం తెలుసా?

  • November 3, 2021 / 12:52 PM IST

‘అపరిచితుడు’ అనగానే మనకు విక్రమ్‌ యాక్టింగ్‌ బిలియెన్స్‌, శంకర్‌ కాన్సెప్ట్‌ గుర్తొస్తుంది. కానీ మనకు రాజశేఖర్‌, శ్రీను వైట్ల గుర్తుకు రావాల్సింది. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవడంతో ఆ కాంబినేషన్‌ మిస్‌ అయ్యాం తెలుసా? అవును ఈ విషయం పుకారు కాదు… శ్రీను వైట్లనే చెప్పుకొచ్చారు. అయితే ఎందుకు మిస్‌ అయ్యింది, ఎలా మిస్ అయ్యింది అనేది తర్వాత చెబుతాం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్‌ ప్రోమో మాత్రమే వచ్చింది.

శ్రీను వైట్ల ఇటీవల ఓ టాక్‌షోకి హాజరయ్యారు. దాని ప్రోమోలో కీలక విషయాలు చెప్పుకొచ్చారు. వాటి ప్రకారం ‘దూకుడు’ అజిత్‌తో చేయాల్సింది అని తెలిపారు. ‘ఆగడు’ ఫ్లాప్‌ గురించి కారణాలు కూడా చెప్పారు. అవన్నీ మీరు చదివే ఉంటారు. వాటితోపాటు రాజశేఖర్‌ సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. ఇప్పుడు ఆ న్యూస్‌ వైరల్‌గా మారింది. ‘నీ కోసం’ కంటే ముందే ఆ సినిమా చేయాల్సిందట.

శ్రీను వైట్ల దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. ఆ క్రమంలో ఓసారి రాజశేఖర్‌ను కలసి ఓ కథ చెప్పారట శ్రీను వైట్ల. ఆ సినిమాకు ‘అపరిచితుడు’ అనే పేరు అనుకున్నారట. సినిమా కూడా మొదలుపెట్టారు. అయితే ఏమైందో కానీ… ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా ‘అపరిచితుడు’ అలా మనం మిస్‌ అయ్యాం. కొన్ని రోజులకు శంకర్‌ – విక్రమ్‌ తీశారు. భారీ హిట్‌ కొట్టారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus