Srinu Vaitla: అన్ని ప్లాపులు ఉన్నా శ్రీను వైట్లని బాగానే నమ్ముతున్నారుగా..!

దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) సినిమాలు అంటే మినిమమ్ గ్యారంటీ అని అప్పట్లో అనుకునే వారు. కానీ పుష్కర కాలం నుండి హిట్టు లేక రేసులో వెనుకబడ్డాడు. ‘ఆగడు’ (Aagadu) నుండి శ్రీనువైట్లకి డిజాస్టర్లు మొదలయ్యాయి. తర్వాత వచ్చిన ‘బ్రూస్ లీ’ (Bruce Lee)  ‘మిస్టర్’ (Mister) ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony)  వంటి సినిమాలు ‘ఆగడు’ మించిన డిజాస్టర్లు అయ్యాయి. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వల్ల శ్రీను వైట్లతో సినిమా అంటే హీరోలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

Srinu Vaitla

మొత్తానికి గోపీచంద్ ను (Gopichand) , పీపుల్ మీడియా వారిని పట్టి ‘విశ్వం’ (Viswam) చేశాడు. అది బిలో యావరేజ్ గా ఆడింది. బడ్జెట్ అయితే రికవరీ అయ్యింది. నిర్మాతలు మాత్రం శ్రీను వైట్లపై నమ్మకం ఉంచడానికి ఇదొక కారణం అని చెప్పాలి.సినిమాని ఫాస్ట్ గా తీయడంలో శ్రీను వైట్ల సిద్ధహస్తుడు. చెప్పిన బడ్జెట్లో తీయగలడు. అందుకే నిర్మాతలు శ్రీను వైట్లపై నమ్మకం ఉంచుతున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి డిజాస్టర్ ఇచ్చినా..

వాళ్ళు మళ్ళీ శ్రీను వైట్లతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కాకపోతే శ్రీను వైట్ల వద్ద ఉన్న మరో కంప్లైంట్ ఏంటి అంటే.. అతని వద్ద సరైన రైటింగ్ టీం లేదు. కోన వెంకట్ (Kona Venkat) ,గోపి మోహన్ (Gopimohan) సెపరేట్ అయ్యాక శ్రీను వైట్ల వెనుకబడటానికి కారణం అదే. అయితే ఇప్పుడు శ్రీను వైట్లకి భాను, నందు అనే ఇద్దరు టాప్ రైటర్లని అప్పగించారట మైత్రి వారు.

ప్రస్తుతం టాలీవుడ్లో ఈ రైటర్స్ గురించి ఎక్కువగానే చెప్పుకుంటున్నారు. ‘సామజవరగమన’ తో (Samajavaragamana) పాటు ‘సింగిల్’ (#Single) సినిమాకి వీళ్ళ రైటింగ్ చాలా ప్లస్ అయ్యింది. సో వీళ్ళు శ్రీను వైట్లకి సింక్ అయితే.. అతనికి బ్లాక్ బస్టర్ దక్కే అవకాశం ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus