Srisatya: భయంతో వణికిపోతున్న శ్రీసత్య..! దెయ్యం టాస్క్ లో ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సంవత్సరం చివరి దశకి వచ్చేసరికి దెయ్యం టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా హౌస్ లో వివిధ రకాలైన సౌండ్స్, విచిత్రమైన నవ్వుతో భయపెడుతుంటాడు. ఈసారి కూడా హౌస్ మేట్స్ ని హడలెత్తిస్తున్నాడు బిగ్ బాస్. దెయ్యం టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు కన్ఫెషన్ రూమ్ లో చీకటి గదిలోకి వెళ్లి అక్కడ కొన్ని వస్తువులని సేకరించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఏది చెప్తే అది చేయాలి.

అప్పుడే ప్రైజ్ మనీలో కొంత రికవరీ అవుతుందని చెప్పాడు బిగ్ బాస్. ఫస్ట్ రౌండ్ లో ఆదిరెడ్డి వెళ్లాడు. కన్ఫెషన్ రూమ్ ని హారర్ సెట్ లాగా మార్చాడు బిగ్ బాస్. దీంతో చీకటి గదిలో ఆదిరెడ్డి హడలిపోయాడు. ఆ తర్వాత తోడుగా తెచ్చుకున్న శ్రీహాన్ కూడా భయపడ్డాడు. వీళ్లిద్దరూ ఫైనల్ గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేశారు. అయితే, చీకటిగదిలోకి శ్రీసత్యని పిలిచాడు బిగ్ బాస్. ఇక్కడే అసలు మజా వచ్చింది.

శ్రీసత్య భయంతో వణికిపోతూ నేను వెళ్లనంటే వెళ్లనని మారాం చేసింది. అంతకుముందు వరకూ దెయ్యం అంటే భయమేలేదని ప్రగల్భాలు పలికిన శ్రీసత్య ఒక్కసారి బిగ్ బాస్ గొంతు వినగానే భయపడిపోయింది. కన్ఫెషన్ రూమ్ దగ్గర చాలాసేపు వెళ్లనంటూ గోల చేసింది. హౌస్ మేట్స్ అందరూ బలవంతంగా తోస్తున్నా కూడా బయట డోర్ దగ్గరే నిలుచుండి పోయింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ శ్రీసత్యని ఏడిపించడం మొదలుపెట్టారు.

నిజానికి బిగ్ బాస్ హౌస్ లో రెండురోజుల నుంచీ హౌస్ మేట్స్ దెయ్యంలాగా మారుతూ శ్రీహాన్ ని ఆటపట్టించారు. అలాగే, ఆదిరెడ్డికి దెయ్యం అంటే భయం అని తెలిసీ రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇనయా, శ్రీసత్య ఇద్దరూ కూడా దెయ్యంలాగా మాట్లాడుతూ వారిని ఆటపట్టించారు. కానీ, ఇప్పుడు తమ వంతూ వచ్చేసరికి భయంతో పరుగులు పెడుతున్నారు.

శ్రీహాన్, ఆదిరెడ్డి ఇద్దరూ కన్ఫెషన్ రూమ్ లోకి భయపడుతూ వెళ్లి, టాస్క్ ని ఫినిష్ చేశారు. కానీ, శ్రీసత్య మాత్రం కన్ఫెషన్ రూమ్ లోకి అడుగు పెట్టడానికి హడలి పోయింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనేది చూడాల్సిందే. అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus