బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 8మంది మాత్రమే ఉన్నారు. వీళ్లలో ఫినాలేకి వెళ్లాలంటే టిక్కెట్ టు ఫినాలే టాస్క్ ఆడమని ఇదొక మంచి అవకాశం అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ టాస్క్ ని సీరియస్ గా తీస్కుని మరీ హౌస్ మేట్స్ ఆడుతున్నారు. స్నోమ్యాన్ అంటూ ఇచ్చిన ఈటాస్క్ లో హౌస్ మేట్స్ స్నోమ్యాన్ భాగాలని కలక్ట్ చేస్కుని వారి వారి స్టాండ్స్ పై దానిని అమర్చాల్సి ఉంటుంది. ఈటాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఒక ఆట ఆడుకున్నారు. రెండు మూడు సార్లు .
బజర్ మోగించి స్టోర్ రూమ్ లో ఏదీ పెట్టకుండా ఆటపట్టించాడు. అలాగే, స్నో కురిసినప్పుడల్లా స్నోమ్యాన్ పార్ట్స్ ని గార్డెన్ ఏరియాలో విసిరాడు. దీనికోసం హౌస్ మేట్స్ పోటీ పడి మరీ కలక్ట్ చేస్కున్నారు. అంతేకాదు, కొంతమందికి హెల్ప్ చేస్కుంటూ గొడవ లేకుండా టాస్క్ ఆడారు. మొదట్లో సంచాలక్ గా ఉన్న ఇనయా కొన్ని రూల్స్ పెట్టింది. కానీ, స్నోమ్యాన్ పార్ట్స్ ని స్టాండ్ పై పెట్టలేదంటూ బిగ్ బాస్ ఇనయాని సంచాలక్ గా తొలగించాడు. దీంతో రేవంత్ సంచాలక్ గా మారాడు.
ఫస్ట్ రౌండ్ లో శ్రీసత్యకి అస్సలు ఎక్కువ భాగాలు దొరకలేదు. అందరికంటే స్పీడ్ గా గేమ్ ఆడలేకపోయింది. మొదటిరౌండ్లోనే వెనుతిరిగింది. అయితే, రేవంత్ తో మాత్రం ఆర్గ్యూమెంట్ పెట్టుకుంటూనే ఉంది. తనకి వచ్చిన డౌట్స్ ని అడుగుతూ రేవంత్ ని రెచ్చగొట్టింది. ఒక పార్ట్ విరిగిపోతే అతికించి వాడుకోవచ్చని, అలాగే తను గేమ్ లో లేకపోయినా ఎదుటివారికి సహాయం చేయచ్చని, నా పార్ట్స్ వేరే వాళ్లకి ఇవ్వచ్చని ఇలా కొత్త రూల్స్ మాట్లాడుతూ రేవంత్ ని ట్రిగ్గర్ చేసింది.
రేవంత్ కి శ్రీసత్యకి ఆర్గ్యూమెంట్స్ అవుతుంటే వేరేవాళ్లు చూస్తు ఉండిపోయారు. ఇక బిగ్ బాస్ ఫస్ట్ రౌండ్ లో తొలగిపోయిన శ్రీసత్యని సంచాలక్ గా పెట్టారు. దీంతో శ్రీసత్య నా దగ్గర ఉన్న పార్ట్స్ ఎవరైనా తీస్కోవచ్చు. నేను ఎలాంటి రూల్స్ పెట్టను అనేసరికి హౌస్ మేట్స్ వాటిని కలక్ట్ చేస్కున్నారు. ఇక రేవంత్ దీనిని అబ్జక్ట్ చేశాడు. అలా సంచాలక్ రూల్స్ మార్చకూడదని చెప్పినా శ్రీసత్య వినిపించుకోలేదు. వాదించే ఓపిక లేక రేవంత్ కూడా సైలంట్ గా ఉండిపోయాడు.
ఇక ఆ తర్వాత రౌండ్ లో ఇనయా, కీర్తి ఇద్దరూ కూడా అవుట్ అయ్యారు. టిక్కెట్ టు ఫినాలే రేస్ నుంచీ కీర్తి, ఇనయా, శ్రీసత్య ముగ్గురూ తొలిగిపోయారు. అయితే, వీళ్లకి బిగ్ బాస్ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. రింగ్ లో టీషర్ట్ కి పెయింట్ పూసే టాస్క్ లో గెలిచిన వాళ్లు తిరిగి రేస్ లో పాల్గొంటారని చెప్పాడు. మరి వీళ్లలో ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. అదీ మేటర్.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..