SriSatya Remuneration: బిగ్ బాస్ ద్వారా బాగానే సంపాదించిన శ్రీ సత్య… రెమ్యూనరేషన్ ఏంతంటే?

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీ సత్య ఎట్టకేలకు 15వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ కు ఆరుగురు ఉండడంతో శ్రీ సత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.మొదటి నాలుగైదు వారాలలోనే బయటకు వెళుతుంది అనుకున్నటువంటి శ్రీ సత్య ప్రతి ఒక్క టాస్క్ లోను అందరికీ గట్టి పోటీ ఇస్తూ చివరి వారం వరకు హౌస్ లో కొనసాగింది.

టాప్ ఫైవ్ లో ఉంటుందని భావించినటువంటి శ్రీ సత్య ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఈమెతో అర్జున్ కళ్యాణ్ పులిహోర కలపడానికి ప్రయత్నాలు చేసిన ఈమె మాత్రం బ్రదర్ అంటూ షాక్ ఇచ్చింది. మొత్తానికి 15 వారాల పాటు హౌస్ లో కొనసాగిన ఈమె టాప్ ఫైవ్ లో ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఉన్నఫలంగా ఎలిమినేషన్ అనేసరికి శ్రీ సత్య కూడా షాక్ అయింది.15 వారాలపాటు హౌస్ లో కొనసాగిన శ్రీ సత్య బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారనే విషయానికి వస్తే ఈమె వారానికి లక్ష రూపాయలు చొప్పున అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం.

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం శ్రీ సత్య 15 వారాలు పాటు హౌస్ లో కొనసాగినందుకు 15 లక్షల రెమ్యూనరేషన్ అందుకుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది. వారానికి లక్ష రూపాయలు అంటే ఈమె బిగ్ బాస్ నుంచి మంచి రెమ్యూనరేషన్ అందుకున్నారని చెప్పాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus