Sruthi Haasan: ఎయిర్ పోర్ట్ ఘటన పై స్పందించిన శృతిహాసన్!

శృతిహాసన్ కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ లోనే ప్రభాస్ సరసన నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతిహాసన్ ఫాలో అవుతూ తనని ఇబ్బందులకు గురి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈమె ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పటి నుంచి కారు పార్కింగ్ వరకు కూడా ఆ వ్యక్తి ఆమె వెంటే వెళ్తూ తనని ఇబ్బందులకు గురి చేశారు.

దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన గురించి శృతిహాసన్ స్పందిస్తూ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినటువంటి ఈమెను ఒక నెటిజన్ ఈ విషయం గురించి ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా అంటూ ప్రశ్నించడంతో ఈమె సమాధానం చెప్పారు.ఎయిర్ పోర్ట్ లో తన వెంటపడినటువంటి ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆయన నా వెనకే ఫాలో అవుతూ ఉంటే ఫోటోలు కోసం వస్తున్నారు అనుకున్నాను.

అయితే ఫోటోగ్రాఫర్ కాస్త దగ్గరగా వెళ్ళమని చెప్పడంతో ఆయన నా పక్కన వచ్చి నిల్చున్నారు. అప్పుడు నాకు చాలా సౌకర్యంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని తెలియజేశారు. సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వస్తే వారి చుట్టూ బాడీగార్డ్స్ ఉండడం మనం చూస్తుంటాం శృతిహాసన్ పక్కన ఎప్పుడూ కూడా బాడీగార్డ్స్ ఉండటం మనం చూడలేదు.

ఈ విషయం గురించి కూడా శృతిహాసన్ (Sruthi Haasan) మాట్లాడుతూ తనకు బాడీగార్డ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు తాను ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాను. అందుకే తాను బాడీగార్డ్స్ ని పెట్టుకొని అయితే ఇకపై ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి అంటూ తాజాగా శృతిహాసన్ ఘటన గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus