Sruti Haasan: ‘నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..’ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

శృతిహాసన్.. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించింది. కొంతకాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి కెరీర్ ను పక్కన పెట్టింది. ఆ తరువాత అతడికి బ్రేకప్ చెప్పేసి తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. గతేడాది రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో నటించింది ఈ బ్యూటీ.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా తరువాత ఆమె బిజీ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’ సినిమాలో నటిస్తోంది. అలానే బాలయ్య 107 సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉండగా.. శృతిహాసన్ కొంతకాలంగా శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో ఉంది.

వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే శృతి మాత్రం శాంతను తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంటుంది. కానీ ఇప్పుడేమో అతడికి ప్రపోజ్ చేశానని చెబుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కపుల్ ఛాలెంజ్ లో పాల్గొన్న వీరిద్దరూ.. తమ రిలేషన్ కి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తానే ముందుగా శాంతనుకి ప్రపోజ్ చేశానని చెప్పింది శృతి.

ఇద్దరిలో ఎవరు బాగా ప్రొటెక్టివ్‌గా ఉంటారని అడగగా.. ఒకరినొకరు చూపించుకున్నారు. శాంతను బాగా తింటాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus