టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి (S. S. Rajamouli) స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. ఒక్కో సినిమాకు రాజమౌళి మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం తీసుకుంటున్నా సినిమా రిజల్ట్ రూపంలో ఆ కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది. అయితే బాహుబలి (Baahubali) సినిమాను జక్కన్న రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించడానికి దర్శకుడు రాఘవేంద్రరావు కారణమట. బాహుబలి మూవీ స్క్రిప్ట్ ను విన్న తర్వాత ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని రాఘవేంద్ర రావు (Raghavendra Rao) రాజమౌళికి సూచనలు చేయగా ఆ సూచనలను జక్కన్న సైతం అంగీకరించారట.
అయితే ఒకానొక సమయంలో రాఘవేంద్రరావు నరకం చూపించారని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు దగ్గర రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తర్వాత రోజుల్లో సీరియల్ డైరెక్టర్ గా, సినిమా డైరెక్టర్ గా పని చేశారు. ఒకానొక సమయంలో రాఘవేంద్రరావు గారు గారిని కలవడానికి వెళ్లగా ఆయన అప్పుడే బయటకు వెళ్తున్నారని ఆయన డ్రైవింగ్ సీట్ లో కూర్చోవడంతో నాకు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదని జక్కన్న తెలిపారు.
భయం భయంగానే ఫ్రంట్ డోర్ తీసి ఆయన పక్కన కూర్చున్నానని రాజమౌళి వెల్లడించారు. ఆ సమయంలో తాను నరకం చూశానని జక్కన్న కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రాఘవేంద్రరావు అంటే రాజమౌళికి ఇంత భయమా అని అభిప్రాయపడుతున్నారు. మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుండగా ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ రావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది.
ఈ ఏడాది ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.