SS Rajamouli, Mahesh: మహేష్ ఫ్యాన్స్ కు జక్కన్న అదిరిపోయే గుడ్ న్యూస్!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఈ నెల 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసి ఆ తర్వాత మహేష్ సినిమా పనులతో బిజీ కావాలని అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం వల్ల జక్కన్న తర్వాత సినిమాలపై కూడా ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో జక్కన్న తర్వాత సినిమాపై దృష్టి పెట్టారని సమాచారం.

తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి రాజమౌళి మహేష్ సినిమా కథను చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో రాజమౌళి మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. మహేష్ ఈ సినిమాలో ఇండియానా జోన్స్ కథానాయకుడి తరహా పాత్రలో నటించే ఛాన్స్ ఉందని బోగట్టా. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

అటు మహేష్ ఇటు రాజమౌళి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం తీసుకోనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసి రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. రాజమౌళి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

2024 సంవత్సరంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రాజమౌళి ఒక్కో సినిమాను తెరకెక్కించడానికి కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆర్ఆర్ఆర్ సమ్మర్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus