Rajamouli: బాలీవుడ్ విషయంలో జక్కన్న చేయాల్సిన పని ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలైనా తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి2 ఓవర్సీస్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేయగా ఆర్ఆర్ఆర్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీపై బాలీవుడ్ లో మాత్రం క్రేజ్ అంతకంతకూ తగ్గుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాహుబలి సిరీస్ వల్ల ప్రభాస్ కు బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చినా రాజమౌళికి మాత్రం అదే స్థాయిలో పాపులారిటీ దక్కలేదు. ఆర్ఆర్ఆర్ మూవీపై బాలీవుడ్ లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి జక్కన్న అంచనాలు పెంచగా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ప్రమోషన్స్ వృథా అయ్యాయి. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత బాలీవుడ్ లో ఈ సినిమాకు మళ్లీ ప్రమోషన్స్ ను నిర్వహించాల్సి ఉంది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే వరకు బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన అప్ డేట్లు ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచాలని తారక్, చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ లో భారీస్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోతే చరణ్, తారక్ మూడున్నరేళ్ల కష్టం వృథా అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో పెద్ద సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్, బన్నీ ఇప్పటికే బాలీవుడ్ లో గుర్తింపును సంపాదించుకోగా ఆర్ఆర్ఆర్ తో చరణ్, తారక్ పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరే ఛాన్స్ ఉంది. మహేష్, పవన్ కూడా పాన్ ఇండియాపై దృష్టి పెడుతుండటం గమనార్హం. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus