ఓ ఏడాది కాలంగా మహేష్ అభిమానుల్ని తొలిచేస్తున్న ప్రశ్న “#SSMB29 ఓపెనింగ్ ఎప్పడు?” అనే. ఒక పక్క మహేష్ బాబు ఒక్కోసారి ఒక్కో లుక్ లో కనిపిస్తూ, రాజమౌళి కొన్నిరోజులు లొకేషన్ స్కౌటింగ్ అని, ఇంకొన్ని రోజులు ఫ్యామిలీ ఫంక్షన్స్ అనే బిజీగా ఉండడం మహేష్ అభిమానుల్ని బాగా ఇబ్బందిపెట్టిన విషయం. ఇవాళ ఆ కన్ఫ్యూజన్ కి తెరపడింది. మహేష్ అభిమానులు మాత్రమే కాక యావత్ ప్రపంచ సినిమా ప్రజానీకం మొత్తం ఆత్రంగా ఎదురుచూస్తున్న రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ సినిమా ఓపెనింగ్ రేపు ఉదయం లాంఛనంగా జరగనుంది.
Mahesh Babu, Rajamouli
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రేపు ఉదయం 10.00 గంటలకు జరగనున్న ఈ ఓపెనింగ్ కి ఇండస్ట్రీ పెద్దలు హాజరవ్వనున్నారు. తన సినిమా ఓపెనింగులకు మహేష్ బాబు ఇప్పటివరకు ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. మరి ఈ సినిమా కోసమైనా అటెండ్ అవుతారా లేదా అనేది చూడాలి. సీనియర్ ప్రొడ్యూసర్ కే.ఎల్.నారాయణ నిర్మించనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఆఫ్రికాలో జరగనుందని సమాచారం.
అలాగే.. హీరోయిన్, విలన్ మరియు సపోర్టింగ్ క్యాస్ట్ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వెలువడనుంది. మరి ఇన్నాళ్లపాటు రెజీనా కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఓపెనింగ్ తో తెరపడనుందనే అనుకోవాలి. ఇకపోతే.. ఈ చిత్రం కోసం ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భాగస్వామిగా వ్యవహరించనుందని సమాచారం. అలాగే పలువురు హాలీవుడ్ నటులు మరియు టెక్నీషియన్స్ కూడా ఈ చిత్రంలో భాగస్వాములు కానున్నారు.
దానికి సంబంధించిన క్లారిటీ కూడా రేపు రానుంది. మరి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని వచ్చిన వదంతులు ఏమవుతాయో చూడాలి. దాదాపు 2000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కన్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ ఎక్స్ ప్లోరర్ పాత్ర పోషించనున్నాడని, ఓ ఇంటర్నేషన్ ఇష్యూ మీద ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉండబోతుందని వినికిడి. 2028లో ఫస్ట్ పార్ట్ & 2029లో సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.