సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమా మేజర్ పార్ట్ అడ్వెంచర్ నేపథ్యంతో సాగనుందని, అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కించబోతున్నారని టాక్. కానీ తాజా అప్‌డేట్ మాత్రం ఫ్యాన్స్‌లో కొంత ఆందోళనను పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషించనున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం, మరో హాలీవుడ్ నటి కూడా సినిమాలో భాగం కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా ఏ దశలో ఉందనేది పూర్తిగా రహస్యంగా ఉంచేందుకు చిత్రబృందం భారీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతే కాదు, సినిమా సెట్‌కు సంబందించిన సమాచారం ఎక్కడికి లీక్ కాకూడదని, టీమ్ సభ్యులు అందరూ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ (NDA) కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమా ఒకే విడతలో పూర్తవుతుందా? లేక మల్టీపార్ట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుందా అనే చర్చ మొదలైంది. రాజమౌళి గతంలో బాహుబలి లాంటి ఫ్రాంచైజీని సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించాడన్న విషయం తెలిసిందే. అదే రీతిలో SSMB29 కూడా రెండు లేదా మూడు భాగాలుగా తెరకెక్కే అవకాశముందనే రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ మహేష్ ఒకే ప్రాజెక్ట్ కోసం 5 ఏళ్ళ కాలాన్ని వెచ్చిస్తాడా? ఈ సినిమా కారణంగా మరే ఇతర ప్రాజెక్ట్ చేయలేకపోతాడా? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి.
అయితే ట్రేడ్ వర్గాల మాటల ప్రకారం, మహేష్ అభిమానులు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదట. రాజమౌళి కథా కథ ఎంత బలంగా ఉంటుందో, ఎంత కష్టపడి రూపొందిస్తారో అందరికీ తెలిసిందే. ఒకసారి ఈ సినిమా ప్రొడక్షన్ ప్రారంభమైతే, అద్భుతమైన విజువల్స్, ఇంటెన్స్ స్టోరీలైన్‌తో మరో ప్రపంచాన్ని చూపించేలా రూపొందనుంది. ఆలస్యం అయినా కూడా వర్త్ అనేలా అవుట్ పుట్ ఇస్తారని చెప్పవచ్చు.
KL నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం గ్లోబల్ స్టేజ్‌లో సత్తా చాటేలా ముస్తాబవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మొత్తానికి SSMB29పై రూమర్లు పెరిగినప్పటికీ, అధికారిక సమాచారం కోసం ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే. రాజమౌళి ఏ ప్రాజెక్ట్‌కైనా తన ప్లానింగ్ పరంగా కచ్చితమైన రూట్‌లోనే ముందుకెళతారు. కానీ, ఈ సినిమా మల్టీపార్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? లేక సింగిల్ పార్ట్‌గా అనుకున్న విధంగా రాబోతుందా? అన్నది అధికారిక క్లారిటీ వచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.