సినీతారల ప్రెగ్నెన్సీ వార్తలంటే జనాలకు ఆసక్తి ఎక్కువ. సినీ పరిశ్రమలో కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే చాలు వెంటనే వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ప్రచారం మొదలవుతుంది. అవి నిజమైతే సెలబ్రిటీలు హ్యాపీగా అధికారికంగా ప్రకటిస్తారు.కానీ అబద్దమైతే కొట్టిపారేస్తారు. మొన్ననే రానా భార్య మిహీకా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం మొదలైతే.. ఆమె స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి క్లారిటీ ఇచ్చింది. అంతకు ముందు ఆది పినిశెట్టి భార్య కూడా గర్భం దాల్చినట్టు ప్రచారం జరిగింది.
అందులో నిజం లేదు అని వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది నటీనటులు వృద్ధ వయసులో కూడా తండ్రులవుతున్నారు. మొన్నామధ్య 51 ఏళ్ళ వయసులో నటుడు మనోజ్ తివారి మూడోసారి తండ్రి తండ్రయ్యాడు. ఇప్పుడు అంతకు మించిన అద్భుతం జరిగిందని చెప్పాలి. తాజాగా ఓ స్టార్ నటుడు 80 ఏళ్ళ వయసులో తండ్రవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇతను తెలుగు నటుడు కాదు కానీ ఈ వార్త పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే.. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన రాబర్ట్ డీ నరో..త్వరలో ‘ఎబౌట్ మై ఫాదర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న అతను తన తండ్రి-పిల్లల గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా యాంకర్ ‘మీకు 6 మంది పిల్లలు కదా?’ అని చెప్పగా.. ‘ఆరు కాదు ఏడుగురు. ఇటీవల ఏడోసారి తండ్రి అయ్యాను. నాకు ఏడో సంతానంగా కొడుకు పుట్టాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
(Actor) రాబర్ట్ డీ నరో.. 1976లో డయానా అబాట్ ని మొదట పెళ్లి చేసుకున్నాడు. 1988 వరకు ఈమెతో కాపురం చేసి కూతురు డ్రేనా(51), కొడుకు రాఫెల్ (46) కు జన్మనిచ్చాడు. 1995లో మోడల్-నటి అయిన టౌకీ స్మిత్ తో సహజీవనం చేసి జూలియన్,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు. 1997లో గ్రేస్ హై టవర్ ని రాబర్ట్ పెళ్లి చేసుకుని ఇల్లియట్ (24), కూతురు హెలెన్ గ్రేస్(11) కు తండ్రయ్యాడు. ఇప్పుడు మరో కొడుకుకి జన్మనివ్వడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?