కష్టంలో ఉన్నప్పుడు చెప్పే ఒక్క మాట అయినా.. ఎంతో సాంత్వనను ఇస్తుంది అంటారు. అదేంటి ఆ మనిషిని ఉక్కుమనిషితో పోలిస్తే.. ఇంకా అద్భుతం. ఇప్పుడు అలాంటి మాటలే సమంత గురించి చెప్పాడు ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్. సోషల్ మీడియా వేదికగా సమంత గురించి రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాసుకొచ్చారు. మయోసైటిస్‌తో సమంత ప్రస్తుతం బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఆ మాటలు రాశారు.
సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ సందేశాన్ని షేర్ చేస్తూ అతడికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన వాళ్లందరూ అందులో ఉన్న పదాలు సమంతకు కచ్చితంగా సరిపోతాయంటున్నారు. ఈ పోస్టులో సమంతను సామీ అని రాహుల్ పిలుచుకొచ్చాడు. సమంతను ఉక్కుమహిళగా అభివర్ణించిన రాహుల్ ఆమె లైఫ్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది రాసుకొచ్చాడు. భవిష్యత్తు మీద భరోసా ఉంచు, దైర్యంగా ఉండు అని కూడా రాశాడు.
‘‘నువ్వు నడుస్తున్న గుహ దారి చీకటిగా ఉండొచ్చు.. చివర ఎక్కడుందో నీకు కనిపించకపోతుండొచ్చు. కాళ్లు తీసి కాళ్లు వేయలేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ ప్రయాణంలో నీకు భయం వేస్తుండొచ్చు. ఎన్నో అనుమానాలూ వస్తుండొచ్చు. అయితే ఒకటి గుర్తుంచుకో. నువ్వు ఉక్కు మహిళవి. విజయం నీ జన్మ హక్కు. నువ్వు ఒక యోధురాలివి. నిన్ను ఏదీ ఓడించలేదు. ఇలాంటి పరిస్థితులు నిన్ను ఇంకా బలపరుస్తాయి. ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి’’ అని రాసి ఉన్న ఓ ఫొటో ఫ్రేమ్‌ను సమంతకు రాహుల్ పంపించాడు.
రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద, సమంత మంచి స్నేహితులు. అలా రాహుల్ కూడా సమంతకు స్నేహితుడు అయ్యాడు. చాలా కాలంగా వీరి స్నేహం సాగుతోంది. ఈ క్రమంలోనే క్రిస్‌మస్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యల ఫ్రేమ్ ఇచ్చారు అని అంటున్నారు. ప్రస్తుతం సమంత ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో ఇలాంటి మాటలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పాలి.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?