సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఈ ఏడాది సెకండాఫ్ లో అంటే జూలై నెల నుండి ఎవరోక సెలబ్రిటీ మరణిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ కు చెందిన వారే కాకుండా.. తమిళ , మలయాళ , హిందీ, కన్నడ , బెంగాలీ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు , ఫ్యాషన్ డిజైనర్లు, లేదా నటీనటుల కుటుంబ సభ్యులు, నిర్మాతలు ఇలా ఎవరోకరు మరణిస్తూ వచ్చారు. తాజాగా మరో నటుడు అనారోగ్య సమస్యలతో మరణించాడు.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళీ నటుడు కొచ్చు ప్రేమన్ అలియాస్ కే.యస్. ప్రేమ్ కుమార్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతూ వస్తున్న ఆయన… ఇప్పుడు పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. కేరళ లో తిరువనంతపురంలో ఉన్న ఆయన నివాసంలోనే కొచ్చు ప్రేమన్ మరణించారు. ఈయన వయసు 68 సంవత్సరాలు.
ఈయన మలయాళంలో 150 కి పైగా చిత్రాల్లో నటించారు.ఈయన ఎక్కువగా కామెడీ రోల్స్ చేస్తుంటారు. ఈయన కామెడీకి అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే కెరీర్ ప్రారంభంలో ఈయన సీరియల్స్ లో కూడా నటించేవారు. సీరియల్స్ లో మాత్రం సహయనటుడు పాత్రల్లో మెప్పించారు. అందుకే ఈయనకు సినిమాల్లో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రేమన్ మృతికి కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా చింతిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.