ప్రముఖ నటుడు ఆత్మహత్య… షాక్ లో ఇండస్ట్రీ..!

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో ఎక్కువగా విషాదాలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా చాలా మంది సినీ నటులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ మధ్యనే ఒడియానటి రష్మీ రేఖ ఓజా ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే.అలాగే ఓ ఫ్యాషన్ డిజైనర్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తాజాగా ఓ మలయాళ నటుడు కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు.వివరాల్లోకి వెళితే.. మలయాళం స్టార్ హీరో అయిన నివిన్‌ పౌలీ హీరోగా `యాక్షన్‌ హీరో బీజు` అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఇందులో విలన్‌గా నటించిన ఎన్‌డీ ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొచ్చిలో ఉన్న కలస్సేరి ప్రాంతంలో రెండు రోజుల క్రితం తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు ఎన్‌డీ ప్రసాద్‌.ఇందుకు ప్రధాన కారణం.. అతను మానసిక ఒత్తిడికి గురవడం అలాగే కుటుంబ సమస్యలు ఎక్కువవడం అని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు మాత్రం రాజీ పడకుండా విచారణ జరుపుతున్నారు.

అంతేకాకుండా ఎన్‌డీ ప్రసాద్‌ గతంలో పలు నేరాల్లో నిందితుడుగానూ ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఓ సందర్భంలో ప్రసాద్ డ్రగ్స్ తో పట్టు పడినట్టు కూడా తెలుస్తుంది.అంతేకాకుండా ఇతని పై ఇంకా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. సినిమాల్లోకి రాక ముందు ప్రసాద్ చాలా నేరాలు చేసినట్టు..

గంజాయి వంటివి స్మగ్లింగ్ చేసినట్టు నమోదైన ఆరోపణలు పోలీసు కస్టడీలో ఉన్నట్టు కూడా… పోలీసులు దర్యాప్తులో తేల్చారు. అందుకే ప్రసాద్ ది పూర్తిగా ఆత్మహత్య అనుకోవడానికి లేదని.. అతని పై శత్రువులు దాడి చేసి ఆత్మహత్యగా మలిచారా? అన్నదానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus