చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. పేరున్న నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఒకరి తర్వాత ఒకరు కాలం చేస్తున్నారు. తాజాగా తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మాండ్య రవి కన్నుమూశారు.ఇతను ఓ కన్నడ టీవీ నటుడు. ఇతని వయసు కేవలం 43 ఏళ్ళు మాత్రమే కావడం విశేషం. మండ్య రవి అలియాస్ రవి ప్రసాద్ కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూ బెంగుళూరులోని బీజీఎస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వస్తున్నారు.
బుధవారం రాత్రి ఆయన మరణించారు. రవి తన భార్య, కొడుకు తో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. రవి.. ప్రముఖ నాటక రచయిత, టీవీ రైటర్, అయిన డాక్టర్ హెచ్ ఎస్ ముద్దు గౌడ కుమారుడు. కన్నడ లోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా పలు సీరియల్స్ లో నటించారు రవి. ప్రముఖ దర్శకుడు టీఎస్ నాగాభరణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహామయి’ సీరియల్ తో ఇతను బుల్లితెరకు పరిచయమయ్యాడు..
మించు, ముక్త ముక్త, మగలు జానకి,చిత్రలేఖ, యశోదే, వరలక్ష్మి స్టోర్స్ వంటి సీరియల్స్ తో ఇతను మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రవి ఉన్నత చదువులు కూడా చదువుకున్నారు. ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేసిన ఈయన ‘లా’ కూడా చదువుకున్నారు. ఇక రవి మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని సెలబ్రిటీలు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.