ఈ నెల రోజుల్లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు.పలు విభాగాలకు చెందిన టెక్నీషియన్లు అలాగే నిర్మాతలు,నటులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి. మొన్నటికి మొన్న మీనా భర్త, రాధికా శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉందని చెప్పాలి. ఒకరిద్దరు ఫ్యాషన్ డిజైనర్లు కూడా మరణించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఓ కమెడియన్ క్రికెట్ ఆడుతూ మరణించడం… అందరినీ ఆందోళన కలిగిస్తుంది. విషయంలోకి వెళితే… బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ పై అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ‘భాభి జీ ఘర్ పర్ హై’ ని చెప్పుకోవచ్చు.ఈ షోతో పాపులర్ అయిన వారిలో దీపేష్ భన్ కూడా ఒకరు. ‘భాభి జీ ఘర్ పర్ హై’ అనే బుల్లితెర షో లో మల్ఖాన్ సింగ్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దీపేష్ భన్.
అయితే శుక్రవారం నాడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉండగా, అకస్మాత్తుగా అతను కుప్పకూలిపోయాడు. దీంతో అతని స్నేహితులు కంగారు పడి వెంటనే దీపేష్ ని ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఇక దీపేష్ మరణ వార్తని ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన వైభవ్ మాథుర్.. వెల్లడించారు. దీపేష్ మరణవార్తతో బాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. అతని వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే కావడం విషాదకరం.