ఈ ఏడాది చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించారు.నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఫ్యాషన్ డిజైనర్లు, నిర్మాతలు లేదా నటీనటుల కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. మరోపక్క చాలా మంది నటీనటులు అనారోగ్యం పాలై.. వైద్యానికి డబ్బులు లేక బాధపడుతున్నారు. తాజాగా కన్నడ సీనియర్ నటుడు మన్‌దీప్ రాయ్ గుండెపోటుకు గురయ్యారు.దీంతో ఆయన్ని వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది.
ఈ విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకు మెరుగైన వైద్యం అందించడానికి.. డబ్బులు సర్దుబాటు కాలేదు అని వినికిడి. 500 కి పైగా సినిమాల్లో నటించిన మన్‌దీప్ రాయ్ ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. మెరుగైన చికిత్స కోసం ఆయన వద్ద డబ్బులు లేవు. అందుకే ఆయన తోటి నటీనటులను ఆర్థిక సహాయం కోసం అర్ధిస్తున్నట్టు వినికిడి.
1980 లో వచ్చిన ‘మించిన ఒట’ అనే మూవీతో మన్‌దీప్ రాయ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన ఆయన మరోపక్క సహాయనటుడు పాత్రలు కూడా పోషించారు. అలా ఆయన 500లకు పైగా సినిమాల్లో నటించారు. కన్నడలో దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఈయన నటించారు. ఇక ఈయన ఆరోగ్యం గురించి అభిమానులు… దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మన్‌దీప్ రాయ్ వయసు ఇప్పుడు 73 ఏళ్ళు.