భార్య పాదాలను తాకాకే నిద్రపోతా.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

భార్య మీద ప్రేమను భర్త చూపించే విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఆ భర్త కోసం భార్య ఏం చేసింది, ఎన్ని ఇబ్బందులు పడింది, ఎంతగా శ్రమించింది లాంటి చాలా అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. తాజాగా ఈ విషయ గురించి ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్‌ మాట్లాడారు. ఓ ఓటీటీ కార్యక్రమానికి రవి కిషన్‌ వెళ్లగా ఈ టాపిక్‌ చర్చకు వచ్చింది. దానికి రవి కిషన్‌ అవును నిజమే అని చెప్పారు కూడా.

Ravi Kishan

తన జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భార్య ప్రీతి ఎంతగానో అండగా నిలిచిందని రవి కిషన్‌ చెప్పకొచ్చారు. అందుకే రోజూ ఆమె పాదాలను తాకి కృతజ్ఞతలు చెప్పనిదే నిద్రపోనని కూడా తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ సినిమా ప్రచారంలో భాగంగా అజయ్‌ దేవ్‌గణ్‌, మృణాల్‌ ఠాకూర్‌, రవి కిషన్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’లో పాల్గొంది. అందులో రవి కిషన్‌ గురించి ఈ విషయం బయటకు వచ్చింది.

షో హోస్ట్‌ కపిల్‌ శర్మ రవి కిషన్‌ గురించి మాట్లాడుతూ రవి రోజూ రాత్రి నిద్రపోయే ముందు భార్య ప్రీతి కిషన్‌ పాదాలను తాకుతారని చెప్పారు. దీన్ని రవి కిషన్‌ నవ్వుతూ అంగీకరించారు. నేను రోజూ అలాగే చేస్తా. కానీ నా భార్య దానికి అంగీకరించదు. అందుకే ఆమె నిద్రపోయిన తర్వాత పాదాలను తాకుతా అని రవి కిషన్‌ క్లారిటీ ఇచ్చారు.

నా దగ్గర పేరు, పలుకుబడి, డబ్బు లేని సమయంలో కూడా నా భార్య నా పక్కన నిలబడింది. ఎన్నో ఒడుదొడుకులను తట్టుకుని మరీ నాకు అండగా నిలిచింది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆమెనే. అంత చేసిన ఆమెకు నేనేం ఇవ్వగలను. అందుకే పాదాలను తాకి నా కృతజ్ఞతలు తెలపాలనుకుంటాను అదే రోజూ చేస్తున్నాను అని రవి కిషన్‌ ఉద్వేగానికి లోనయ్యారు.

‘కాంతార’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిషబ్ శెట్టి.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus