ఆర్టిస్టులను నీచంగా చూస్తారంటున్న ప్రముఖ నటుడు!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నటులకు ఇచ్చే గౌరవానికి పెద్దగా గుర్తింపు లేని నటులకు ఇచ్చే గౌరవానికి చాలా వ్యత్యాసం ఉంటుందనే సంగతి తెలిసిందే. సక్సెస్ లో ఉన్న నటీనటులను గోల్డెన్ లెగ్ అని ఇండస్ట్రీలో ఏ విధంగా కీర్తిస్తారో వరుస ఫ్లాపుల్లో ఉన్న నటీనటులకు అదే విధంగా ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తారు. సినిమాలలో, సీరియళ్లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో మేకా రామకృష్ణ ఒకరు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మేకా రామకృష్ణ ప్రొడక్షన్ బాయ్స్ ఆర్టిస్టుల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తారో చెప్పుకొచ్చారు. కొంతమంది ఆర్టిస్టులతో ప్రొడక్షన్ బాయ్స్ నీచంగా ప్రవర్తిస్తారని చిన్న ఆర్టిస్టులను ప్రొడక్షన్ బాయ్స్ చులకనగా చూస్తారని మేకా రామకృష్ణ తెలిపారు. మనం అడుక్కునే వాళ్లకు కూడా మర్యాద ఇస్తామని ప్రొడక్షన్ బాయ్స్ ప్రవర్తించే తీరు చూసి కళ్లలో నీళ్లు తిరుగుతాయని ఆయన అన్నారు. సపోర్టింగ్ ఆర్టిస్టుల విషయంలో ప్రొడక్షన్ బాయ్స్ పనితీరు ఈ విధంగా ఉంటుందని కొన్నిసార్లు వాళ్లను తిట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారు.

మంచినీళ్లుగా టాయిలెట్ నీళ్లను ఇచ్చేవారని ఎవరైనా ప్రొడక్షన్ బాయ్స్ ను తిడితే వాళ్లకు మోషన్ టాబ్లెట్స్ ఇచ్చేవారని ఆయన తెలిపారు. జయసుధ గారికి కాఫీలో మోషన్ టాబ్లెట్లను కలిపి ఇచ్చారని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఒకసారి భోజనానికి కూర్చుంటే మిగతావాళ్లకు వేడి అన్నం పెట్టి నాకు బయటనుంచి తెప్పించిన అన్నం పెట్టారని మేకా రామకృష్ణ కామెంట్లు చేశారు. ఆ అవమానానికి నాకు చనిపోవాలని అనిపించిందని ఆయన వెల్లడించారు. దర్శకనిర్మాతలకు ఈ విషయాలు తెలియవని ఆయన అన్నారు.

ఈ విషయాలను బయటపెడితే సినిమాలలో అవకాశాలు దక్కవని మేకా రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సీరియళ్లలో ఛానల్ వాళ్ల వల్ల తమకు అవకాశాలు దక్కడం లేదని మేకా రామకృష్ణ కామెంట్లు చేశారు. మేకా రామకృష్ణ కామెంట్లు విన్న తరువాతైనా అలా ప్రవర్తించే ప్రొడక్షన్ బాయ్స్ మారతారేమో చూడాల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus