సెలబ్రిటీల ఇళ్లను కూడా కొందరు దుండగులు, గజదొంగలు టార్గెట్ చేసి ఎటాక్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. గతంలో చూసుకుంటే మోహన్ బాబు, పూర్ణ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారి ఇళ్లను కొందరు దొంగలు టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు. అవి సంచలనమయ్యాయి. ఇప్పుడు ఓ టీవీ నటుడి ఇల్లు దొంగలకు టార్గెట్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన శబరినాథన్ అనే బుల్లితెర నటుడు ఇంట్లో దొంగలు పడ్డారు.
బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు శబరినాథన్. తమిళనాడులోని సేలం కోరిమేడు సమీపంలో ఉన్న బృందావనం గార్డెన్ ఏరియాలో ఆయన నివాసం ఉంది.అయితే నవంబర్ నెల 23న ఆయన తన చిన్నాన్న అంత్యక్రియలు నిమిత్తం వెళ్లారు.శబరినాథన్ కుటుంబ సభ్యులు అంతా ఆ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. అయితే వాళ్లు తిరిగి 24వ తేదీన తిరిగి రాగా.. .. వారి ఇంటి తాళం పగులగొట్టి, తలుపులు తెరిచి ఉండటం చూసి వారి షాక్ కి గురైనట్టు తెలుస్తుంది.
తర్వాత వాళ్ళు లోపలి వెళ్లి చూడగా.. లక్ష రూపాయల డబ్బుని, అలాగే 5 గోల్డ్ కాయిన్స్, కొన్ని వెండి వస్తువులు చోరీ అయినట్లు వారు గుర్తించారు. దీంతో అలగాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్ళు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.ఇక తక్కువ టైంలోనే పోలీసులు దొంగని పట్టుకున్నట్టు సమాచారం. ధర్మపురికి చెందిన మణికంఠన్.. శబరినాథన్ (Sabarinathan) ఇంట్లో చోరీకి పాల్పడినట్లు తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని సమాచారం.