ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇక్కడ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై వైసిపి మద్దతు దారుడు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ హెడ్ గా ఉన్న జోగి నాయుడు తాజాగా పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జోగి నాయుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జోగి నాయుడు మాట్లాడుతూ తాను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ కార్యకర్తగా పని చేశానని తెలిపారు. అయితే కొన్ని సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ తనకు ఏమాత్రం నచ్చలేదని తెలిపారు.పవన్ సిద్ధాంతాలు నచ్చిన ఆయన చేసే పనులన్నీ సినిమాటిక్ గా ఉంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే గాలివాటం రాజకీయాలు చేస్తున్నారని ఆ తర్వాత మాయమైపోతారని జోగినాయుడు తెలిపారు.
(Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కి సినిమాలు ప్రొఫెషనల్ రాజకీయాలు కాదని తెలియజేశారు. కానీ జగన్ కి రాజకీయమే ఒక ప్రొఫెషన్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఆ వ్యాపారాల బాధ్యతలన్నింటిని ఆయన ఇతరులకు అప్పగించారు. ఇలా వ్యాపారాలను ఇతరులకు అప్పగించి ఆయన పూర్తి రాజకీయ నాయకుడిగా ప్రజలలోనే ఉంటున్నారని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు. ఎన్నికలు అయిపోగానే సినిమాలలోకి వెళ్తారు తీరా ఎన్నికల సమయానికి వస్తారు అంటూ జోగినాయుడు తెలిపారు.
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్లకుండా పూర్తిగా ప్రజలలో ఉండి ఉంటే కనుక పరిస్థితి మరోలా ఉండేదని జోగినాయుడు తెలియజేశారు. ఇలా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జోగి నాయుడు ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన చేసిన కామెంట్స్ కు పవన్ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.