కన్నడ చిత్ర సీమలో ఘోరమైన సంఘటన నటుడి సోదరి మిస్సింగ్!

కుటుంబ సభ్యులు ఒక్క రోజు మన దగ్గర లేకపోతే మనసంతా చాలా ఒత్తిడికి గురైనట్టు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనిపించకుండా పోతే ఇంకెంత బాధాకరంగా, భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఓ కన్నడ నటుడి కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. వివరాల్లోకి వెళితే..ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు అయిన నవీన్ కృష్ణ సోదరి అయిన నీతూ పవర్ కనిపించకుండా పోయింది. ఆమె ఇంటికి వెళ్లి 4 రోజులు అవుతుందట.

దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆమెకు ఏమైందో అని కంగారు పడుతున్నారు. అయితే నీతూ మిస్ అయిన విషయాన్ని నవీన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. నవీన్ ఈ విషయంపై స్పందిస్తూ… ‘సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మా సోదరి నీతు జనవరి 17 మధ్యాహ్నం 2:57 నుండి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా సోదరి ఆచూకీ లభిస్తే మాకు తెలియజేయగలరు’ అంటూ పేర్కొన్నాడు.

ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అని నవీన్ తెలియజేశాడు. కన్నడ మీడియా సమాచారం ప్రకారం.. నీతు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె కుటుంబానికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేపట్టారు అని వినికిడి. కుటుంబ సభ్యులు మాత్రం నీతు క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు చెబుతున్నారట. నీతు మిస్సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus