Star Actor: బుల్లితెర నటుడి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వాళ్లంతా బాగా సంపాదించేస్తారు అనుకోవడం వట్టి అపోహ. సక్సెస్ ఉంటేనే ఇక్కడ ఏదైనా వస్తుంది. లేదు అంటే.. వెంటనే దానికి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోవడం బెటర్ అని చాలామంది అంటారు. ఎందుకంటే వచ్చిందాంట్లో 20 శాతం మేనేజర్లకు ఇంకో పది శాతం పీఆర్..లకి ఖర్చు పెట్టగా.. ఇంకో 18 శాతం వరకు టాక్సులు వంటి వాటికి పోతుంది అంటూ చాలా మంది నటీనటులు చెబుతూ ఉంటారు.

అయితే నటనకు గుడ్ బై చెప్పి కోట్లకు కోట్లు వ్యాపారం చేసి సంపాదించిన వారు చాలా మందే ఉన్నారు. శోభన్ బాబు వంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నారు. అంతేకాదు ఓ నటుడు అయితే నటనకు గుడ్ బై చెప్పేసి ఏకంగా రూ.1400 టర్నోవర్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీకి యజమాని అయ్యాడట. వివరాల్లోకి వెళితే.. 1983 వ సంవత్సరంలో దూరదర్శన్‌లో ‘రామాయణం’ అనే సీరియల్ ప్రసారమయ్యేది.

కోవిడ్-19 టైంలో దీనిని పలు ఛానల్స్ లో ప్రచారం చేశారు. ఇందులో రాముడి పాత్రలో అరుణ్ గోవిల్ నటించగా, సీత పాత్రలో దీపికా చిఖాలియా నటించింది. ఇందులో లవ్ – కుష్ పాత్రలు కూడా చాలా కీలకం. సీరియల్‌లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి పోషించగా, (Star Actor) మయూరేష్ క్షేత్రమదే.. లవ్ పాత్రలో కనిపించాడు.

అటు తర్వాత ఇతను బుల్లితెరకి కూడా దూరమయ్యాడు. ఆ తర్వాత ఇతను బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.మయూరేష్ కమీషన్ జంక్షన్ (సీజే) అఫిలియేట్ సీయీవో.. కుటుంబంతో US లో సెటిల్ అయ్యాడు. మయూరేష్ ఇప్పుడో సక్సెస్ఫుల్ బిజినెస్మెన్. ఆయన కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ.1400 కోట్లు (USD 170 మిలియన్లు) ఉంటుందని సమాచారం.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus