కారు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. శోకసంద్రంలో ఫ్యాన్స్!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న విషాదాలు అభిమానులను ఎంతో బాధ పెడుతున్నాయి. తాజాగా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సూరజ్ మెహర్ కారు ప్రమాదంలో మృతి చెందారు. నిశ్చితార్థం రోజున సూరజ్ మెహర్ మృతి చెందడం ఆయన అభిమానులను మరింత బాధ పెడుతోంది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సూరజ్ మెహర్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం అందుతోంది.

ఈ కారు ప్రమాదంలో డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఒడిశాలో ఈరోజు సూరజ్ మెహర్ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం ఫ్యాన్స్ ను మరింత బాధ పెడుతోంది. విలన్ రోల్స్ ద్వారా పాపులర్ అయిన సూరజ్ మృతి చెందడంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ప్రస్తుతం సూరజ్ అఖ్రీ ప్లైసా అనే సినిమాలో నటిస్తున్నారని ఆ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. బిలాస్ పూర్ లో సరియా సూరజ్ స్వస్థలం కాగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. సినీ, రాజకీయ ప్రముఖులు సూరజ్ మెహర్ మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

శుభకార్యం జరగాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం సినీ వర్గాలను సైతం షాక్ కు గురి చేసింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. కారు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus