సినిమా పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు,సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తండ్రి, లెజెండరీ పాప్ సింగర్ రాబెర్టా ఫ్లాక్,హాలీవుడ్ సీనియర్ హీరో జీన్ హ్యాక్ మ్యాన్, జయప్రద సోదరుడు రాజబాబు వంటి వారు కన్నుమూశారు. ఇంతలోనే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ (Uttam Mohanty ) మృతి చెందారు. ఆయన వయసు 66 ఏళ్ళు అని తెలుస్తుంది. కొద్దిరోజుల నుండి ఆయన లివర్ సిర్రోసిస్ అనే వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ వస్తున్నారట. ఈ క్రమంలో ఆయన్ని గురుగ్రామ్‌లోని మెడాంటా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స పొందుతూనే నిన్న(ఫిబ్రవరి 27) ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన (Uttam Mohanty ) ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఉత్తమ్ మొహంతి (Uttam Mohanty ) సినీ కెరీర్ ను పరిశీలిస్తే.. 1977 వ సంవత్సరంలో ‘అభిమాన్’ అనే సినిమాతో ఒడియా సిని పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1980, 90ల టైంలో టాప్ ప్లేస్ కి చేరుకున్నారు. ఆయన 50 ఏళ్ళ సినీ కెరీర్లో మొత్తంగా 135కి పైగా సినిమాల్లో నటించారు మొహంతి. ఒడియాలోనే కాకుండా బెంగాలీ, హిందీ సినిమాల్లో కూడా నటించారు.