సందీప్ కిషన్ (Sundeep Kishan) – రావు రమేష్ (Rao Ramesh) కాంబినేషన్లో ‘మజాకా’ (Mazaka) అనే సినిమా రూపొందింది. ‘ధమాకా’ తో (Dhamaka) వంద కోట్ల క్లబ్లో చేరిన త్రినాధ్ రావ్ నక్కిన (Trinadha Rao) ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఇది మొదటి నుండి క్రేజీ ప్రాజెక్టు అనిపించుకుంది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించడం కూడా జరిగింది. సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించగా, రావు రమేష్ సరసన అన్షు (Anshu Ambani) నటించింది. ఫిబ్రవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దీనికి టాక్ అనుకున్నట్టు రాలేదు. మిక్స్డ్ ఒపీనియన్స్ ఎక్కువగా వినిపించాయి. అయినప్పటికీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. దీనికి టీం అంతా హాజరయ్యారు. ఒక్క రావు రమేష్ తప్ప. ఆయన ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకటి ఈ సినిమా ఔట్పుట్ తో అతను సంతృప్తిగా లేడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంకోటి ఈ సినిమా హీరో సందీప్ కిషన్ తో రావు రమేష్ కి మనస్పర్థలు వచ్చినట్టు కూడా టాక్ వినిపిస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయట. విషయం ఏంటంటే.. రావు రమేష్ ఈ సినిమా కోసం ఎప్పుడో డేట్స్ ఇచ్చాడట. కానీ సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) ‘రాయన్’ (Raayan) వంటి సినిమాలతో బిజీగా ఉండి.. ‘మజాకా’ ని పట్టించుకోకపోవడం వల్ల..
ప్రాజెక్టు డిలే అవుతూ వచ్చిందట. మరోపక్క సందీప్ కిషన్ తో సమానమైన రోల్ అని డైరెక్టర్ రావు రమేష్ కి చెప్పారట. తర్వాత అతని స్క్రీన్ స్పేస్ తగ్గించడం పట్ల కూడా రావు రమేష్ గొడవ పెట్టుకుని సెట్స్ నుండి వెళ్ళిపోయినట్టు ఇన్సైడ్ టాక్. ఇక టాక్ ఎలాగు అనుకున్నట్టు రాలేదు కాబట్టి.. ‘మజాకా’ ని వదిలించుకోవాలని రావు రమేష్ డిసైడ్ అయినట్టు సమాచారం.