ఇప్పుడంటే నవలలు ఓల్డ్ స్టైల్ అయిపోయి, వాటి ఆధారంగా సినిమాలు తెరకెక్కడం అనేది రేర్ ఫీట్ అయిపోయింది కానీ. ఒకప్పుడు చాలా సినిమాలు నవలలు ఆధారంగా రూపొందేవి. నవలా రచయితలైన యండమూరి, సులోచన రాణి, మధుబాబు వంటి వారికి మంచి డిమాండ్ ఉండేది. చిరంజీవి నటించిన “స్టువర్టుపురం పోలీస్ స్టేషన్” నవల ఆధారంగా రూపొందిన సినిమా అనేది అందరికీ తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తోనే అదే తరహాలో యండమూరి రచించిన పాపులర్ నవల “ది డైరీ ఆఫ్ మిసెస్ శారద” ఆధారంగా ఓ సినిమా రూపొందించాలని ప్లాన్ చేశాడట నాగబాబు(Naga Babu).
ఆయన స్వంత బ్యానర్ అయిన అంజనా ప్రొడక్షన్స్ లో సదరు నవల ఆధారంగా భారీ చిత్రం ఒకటి ప్లాన్ చేశారు. ఓ అగ్ర దర్శకుడిని సైతం ఫైనల్ చేశారట. కానీ.. ఆఖరి నిమిషంలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గడంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేకపోయిందట. అప్పట్లోనే మంచి బడ్జెట్ సైతం కేటాయించారట ఈ చిత్రం కోసం.
ఒకవేళ ఆ ప్రాజెక్ట్ గనుక అనుకున్నట్లుగా షూటింగ్ జరిగి, థియేటర్లలో విడుదలై ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ థ్రిల్లర్ కూడా ఉండేది. ఎందుకంటే.. యాక్షన్, కామెడీ, డ్రామా, లవ్, సోషియో ఫాంటసీ వంటి అన్నీ జానర్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ కెరీర్లో హారర్ & థ్రిల్లర్ మాత్రమే మిగిలిపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్నా సినిమాలు చేయడం అనేది కాస్త కష్టమే.
రాజకీయ నాయకుడిగా అంత బిజీ అయిపోతున్నాడు రోజురోజుకీ. మరి పవన్ కళ్యాణ్ తన ప్రజానీకానికి మాత్రమే కాక తన అభిమానులను కూడా సంతుష్టులను చేయడం కోసం త్వరత్వరగా “ఓజీ” (OG Movie) షూటింగ్ చేసేస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఆ సినిమా కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు.