కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో అరుణ్ రామ గౌడ ఒకరు. రాముడి భక్తుడైన రామ గౌడ అయోధ్యలోనే తన పెళ్లి జరుగుతుందని తాజాగా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 22వ తేదీన రామ గౌడకు ఐశ్వర్య అనే యువతితో నిశ్చితార్థం జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అరుణ్ రామ గౌడ మీడియాతో మాట్లాడుతూ తాను రామ భక్తుడినని అందుకే అయోధ్యలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
మేమిద్దరం పది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని కెరీర్ లో స్థిరపడ్డాకే లైఫ్ లో ముందడుగులు వేయాలని అనుకుంటున్నామని రామ గౌడ వెల్లడించారు. ఇప్పుడా సమయం వచ్చిందని భావిస్తున్నామని రామ గౌడ తెలిపారు. మేము పెళ్లికి సిద్ధపడటంతో కుటుంబ సభ్యుల సంతోషానికి సైతం అవధులు లేకుండా పోయాయని రామగౌడ చెప్పుకొచ్చారు. ఐశ్వర్య చాలా నిజాయితీగా ఉంటుందని ఎంతో అర్థం చేసుకుంటుందని రామగౌడ కామెంట్లు చేశారు.
నాకంటూ ఒక రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉందని ఆయన కామెంట్లు చేశారు. అటు సినిమాలు ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నానని రామగౌడ చెప్పుకొచ్చారు. ఆరు నెలలలో దర్శకుడిగా ఒక సినిమా చేయబోతున్నానని రామ గౌడ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో అయోధ్యలో మా పెళ్లి జరుగుతుందని రామ గౌడ చెప్పుకొచ్చారు. (Arun Ram Gowda) రామగౌడ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
రామగౌడ ఐశ్వర్య పెళ్లి తర్వాత సంతోషంగా, అన్యోన్యంగా జీవనం సాగించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయోధ్యలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న రామగౌడ నిర్ణయాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. అయోధ్యలో రాబోయే రోజుల్లో మరి కొందరు సినీ సెలబ్రిటీలు సైతం పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయోధ్య రామ మందిరం పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుండగా ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.