నకిలీ నగలు ఇచ్చి నీ మొహానికి అవే ఎక్కువ అన్నాడు.. నటి ఆవేదన..!

‘మీటూ’ టైములో తను శ్రీ తో పాటు రాఖీ సావంత్‌ పేరు కూడా ఎక్కువగా వినిపించేది. ఎందుకు అన్న విషయం ఇప్పుడు అప్రస్తుతం. అసలు మేటర్ కు వచ్చేద్దాం. ఈ ఏడాది ప్రేమికుల రోజునే భర్తతో తెగదెంపులు చేసుకుని వార్తల్లో నిలిచింది రాఖీ సావంత్‌. ఇది వరకే అతనికి పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి టార్చర్ పెడుతున్నాడని ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాఖీ… అదిల్‌ దురానీ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.

మళ్ళీ ఆమె కొత్త జీవితం మొదలుపెడుతుంది అనుకుంటున్న టైములో తన మాజీ భర్త రితేశ్‌ పై పోలీస్‌ స్టేషన్‌ లో కంప్లైంట్ ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది రాఖీ. తనని నిలువుదోపిడీ చేశాడు ఇప్పటికీ వేధిస్తున్నాడు అంటూ ఆమె మీడియాతో మాట్లాడింది. రాఖీ సావంత్‌ మాట్లాడుతూ.. “రితేశ్‌ నాకు గిఫ్ట్ గా కారిచ్చాడు అనేది నిజమే. కానీ దానిని అతనికి తిరిగిచ్చేశాను. అతని జ్ఞాపకాలు ఏవీ నాకు అవసరం లేదు అనే ఉద్దేశంతో అవి తిరిగిచ్చేయడం జరిగింది. నా కోసం కోట్లు ఖర్చు చేశాడని చెప్పుకు తిరుగుతున్నాడు, అందులో నిజం లేదు.

అతను నాకు ఇచ్చిన నగలు కూడా నకిలీవే. ఓసారి మా అమ్మకు ఆరోగ్యం బాలేదని వాటిని తాకట్టు పెట్టడానికి నగల దుకాణానికి వెళ్తే… అవి నకిలీవని తేలాయి. ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా? అని అతనికి మెసేజ్‌ పెట్టాను. అందుకతడు స్పందిస్తూ ‘నీకదే ఎక్కువ’ అని జవాబిచ్చాడు. చదువు సంధ్య లేని దాన్ని అని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. నా అకౌంట్స్‌ హ్యాక్‌ అయ్యాయని వార్తలు రావడంతో నా డబ్బు తిరిగిచ్చేశాడు. ఇప్పుడు నేను అన్నింటి పాస్‌వర్డ్స్‌ చేసుకున్నాను. పోలీసులకు చేసిన ఫిర్యాదు కూడా వెనక్కి తీసుకుంటాను. నిజంగా ప్రేమించే వారు కేసులు పెట్టరు.

రితేశ్‌ను నేను ప్రేమించి, పెళ్లి చేసుకుంది నిజమే. కానీ అతను నన్ను చిత్ర హింసలు పెట్టాడు. ప్లేటులో భోజనం పెట్టి నా మొహం పై విసిరేవాడు. కొట్టేవాడు. అయినా సరే నేనతని కాళ్లు పట్టుకుని నాతో ఉండమని బ్రతిమిలాడేదాన్ని. కానీతనకు పెళ్లై, పిల్లలు ఉన్న విషయాన్ని దాచి పెట్టాడని తెలిసి…. నిలువునా మోసపోయాను అనిపించింది. మా అమ్మను ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత అతను ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు నా ప్రియుడితో కొత్త జీవితం మొదలు పెడదామంటే కూడా అడ్డుపడుతున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus