టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటిగా, దర్శకురాలిగా మహానటి సావిత్రి గుర్తింపును సంపాదించుకున్నారు. బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న సావిత్రి చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టినా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. సావిత్రి జీవిత విశేషాలతో తెరకెక్కిన మహానటి సినిమా 2018 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బాబూరావు సావిత్రికి దీప అనే నటిని పరిచయం చేశారు.
సావిత్రి దీపతో మంచి పాత్రలు చేస్తున్నావా అని అడగగా దీప కనురెప్పలు మూస్తూ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలలో బుక్ అయ్యానని చెప్పింది. ఆ తర్వాత సావిత్రి దీపతో నటికి భాష ముఖ్యం కాదని ఎలాంటి పాత్రలు వస్తున్నాయనేది ముఖ్యమని ప్రతిభను ప్రదర్శించాలంటే అనువైన పాత్రలు రావాలని చెప్పారు. ఆ తర్వాత రోజు షూటింగ్ కు సావిత్రి సరైన సమయానికి హాజరు కాగా దీప మాత్రం ఆలస్యంగా వచ్చారు. దీప వచ్చే సమయానికి దర్శకుడు సావిత్రిపై క్లోజప్ షాట్స్ తీశారు.
షూటింగ్ కు దీప గంటన్నర ఆలస్యంగా రావడంతో సావిత్రికి ఆమెపై కోపం వచ్చింది. సావిత్రి దీపతో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చావని షూటింగ్ కు ఆలస్యంగా వస్తే ఎలా అని అడిగారు. దీప సమాధానంగా ఉదయం నుంచి తలనొప్పితో బాధ పడుతున్నానని రెస్ట్ తీసుకోవాలని అనుకున్నానని చెప్పారు. మీరు సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టే సంజాయిషీ ఇస్తున్నానని సావిత్రికి దీప సమాధానం ఇచ్చారు. సావిత్రి షూటింగ్ ఎగొట్టేద్దామనుకున్నావా? ఇక్కడే నువ్వు విశ్రాంతి తీసుకో అని కామెంట్ చేశారు.
వ్యాధితో బాధపడుతూ మంచం ఎక్కే సీన్ ను ఈరోజు షూట్ చేస్తున్నారని సెట్ లో మంచం సిద్ధంగా ఉందని నీరసంగా పడుకుంటే ఎఫెక్ట్ బాగా వస్తుందని సావిత్రి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. దీప ఒక్క మాట మాట్లాడకుండా మేకప్ గదివైపు వెళ్లారు. ఈ విషయం తెలిసి సావిత్రికి ఇంత కోపమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.