Allu Arjun: పుష్ప కోసం అల్లు అర్జున్ అంతలా కష్టపడ్డారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

ఈ సినిమాలో ఈయన ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించారు అదేవిధంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఢీ గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇలా ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో తన నటన ద్వారా అందరిని మెప్పించినటువంటి ఈయనకు ప్రస్తుతం నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందంతో పాటు మెగా అల్లు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు వస్తుందని రష్మిక ముందుగానే జోస్యం చెప్పారట.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో రష్మిక మందన్న నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె కూడా డి గ్లామర్ పాత్రలో నటించి మెప్పించారు.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని రష్మిక తెలియజేస్తూ ఈ సినిమాలో అల్లు అర్జున్ నటునకు తప్పకుండా నేషనల్ అవార్డుతో పాటు ఇతర అవార్డ్స్ కూడా వస్తాయని ఈమె తెలియజేశారు.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ (Allu Arjun) ఎంతో కష్టపడ్డారని రష్మిక తెలియజేశారు. కేవలం మేకప్ కోసమే మూడు గంటల పాటు సమయం కేటాయించే వారని తెలిపారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారని ఈయనకు కనుక నేషనల్ అవార్డు రాకపోతే ముందుగా బాధపడే వ్యక్తిని తానే అంటూ గతంలో రష్మిక చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె చెప్పిన విధంగానే అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం విశేషం.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus