ప్రభాస్ పాటకు స్టెప్పులేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. అతనితో సినిమా చెయ్యడానికి ఎంతో మంది దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. అంతేకాదు కొంతమంది నటీ నటులు కూడా ప్రభాస్ ‘సినిమాలో ఛాన్స్ వస్తే బాగుణ్ణు’ అంటూ ఎంతో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలో నటిస్తే.. సౌత్ తో పాటు నార్త్ లో కూడా పాపులర్ అయిపోవచ్చు. దాంతో వరుస సినిమాల్లో అవకాశాలు కొట్టెయ్యొచ్చు. తెలుగులో కాకపోతే తమిళ్, మలయాళం, కన్నడ భాషల సినిమాల్లో ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అదృష్టం బాగుంటే బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.

ఇప్పుడు ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ కూడా ప్రభాస్ ను అలాగే అతని ఫ్యాన్స్ ను టార్గెట్ చేసినట్టు ఉందని చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఇంకెవరు మన జెనీలియా. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాయ్స్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జెనీలియా.. ఆ తరువాత ‘సత్యం’ ‘సై’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘రెడీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా బన్నీ తో ‘హ్యాపి’, రాంచరణ్ తో ‘ఆరెంజ్’, ఎన్టీఆర్ తో ‘సాంబ’ ‘నా అల్లుడు’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కూడా నటించింది.

అయితే కొత్త హీరోయిన్ల రాకతో ఈమెకు ఆఫర్లు రాకపోవడంతో.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను 2012లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ప్రభాస్ పాటకు డ్యాన్స్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది. ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రంలోని ‘మనోహరి’ అనే పాటకు ఇసుకలో డ్యాన్స్ చేసి ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చెయ్యాలి’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది. దీంతో ఈ అమ్మడు ‘రీ ఎంట్రీకి ప్రభాస్ ను టార్గెట్ చేసిందని’ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video


కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus