నిన్ను కచ్చితంగా జైలుకు పంపిస్తా అంటున్న నటి

బాలీవుడ్‌ నటి దివ్య భట్నాగర్‌ కరోనా లక్షణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె నిజ జీవితంలో బయటకు తెలియని చాలా అంశాలు ఉన్నాయంటోంది దెవోలీనా భట్టాచార్య. దివ్య భట్నాగర్‌కు దెవోలీనా మంచి స్నేహితురాలన్న విషయం తెలిసిందే. దివ్య భర్త ఆమెను ఎప్పుడూ వేధిస్తుండేవాడంటూ దెవోలీనా… దివ్య భట్నాగర్‌ జీవితం గురించి షాకింగ్‌ విషయాలు చెప్పింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసింది. నువ్వు మరణంతో జీవితంలో ఇన్నాళ్లుగా పడుతున్న బాధలు, కష్టాలు, మోసాల నుంచి విముక్తి పొందావ్‌ అంటూ దెవోలీనా కన్నీళ్లు పెట్టుకుంది.

‘‘దివ్య ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, వేధింపుల గురించి చెప్పడానికి, ఆమె భర్త అసలు రంగు గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చా’’ అంటూ వీడియోలో దెవోలీనా మొత్తం విషయం చెప్పుకొచ్చింది. ‘‘గగన్‌ గబ్రూ.. నేను నీ గురించే మాట్లాడుతున్నా. దివ్య తల్లి, సోదరుడు మీ ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారని, మిమ్మల్ని అడ్డుపెట్టుకుని పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారని నువ్వు అందరి దగ్గర చెబుతున్నావ్‌. అసలు నీకు సమాజంలో గుర్తింపే లేదు. దివ్యతో పరిచయం పెంచుకుని, నీ ప్రేమను అంగీకరించాలని బతిమిలాడావు. నీ వల్ల దివ్యకు నాలుగేళ్లుగా దూరంగా ఉన్నాను’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది దెవోలీనా.

‘‘సిమ్లాలో నీపై వేధింపుల కేసు నమోదైంది. ఇప్పుడు బెయిల్‌పై బయట తిరుగుతున్నావు. నిన్ను తిరిగి జైలుకు పంపిస్తా. దివ్యను వేధించినందుకు నీకు శిక్ష తప్పదు. భార్య చనిపోయిందని నీ ప్రియురాళ్లతో ఎంజాయ్‌ చేయొచ్చని అనుకుంటున్నావేమో. నిన్ను నేను అంత తేలిగ్గా వదలను’’ అంటూ హెచ్చరించింది దెవోలీనా. అంతేకాదు గగన్‌తో సన్నిహితంగా తిరిగే అమ్మాయిలను కూడా దెవోలీనా హెచ్చరించింది.

కరోనా, న్యుమోనియా వ్యాధులతో బాధపడుతూ దివ్య భట్నాగర్‌ ఇటీవల కన్నుమూసిన విష్రం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. మరోవైపు దివ్యను తన భర్త వేధింపులకు గురి చేసేవాడంటూ ఆమె సోదరుడు దేవశీష్‌ ఆరోపించాడు. ఈ మేరకు పూర్తి వివరాలతో నోట్‌ దొరికిందని కూడా చెప్పాడు. ఇప్పడు దెవోలీనా కూడా ఇదే మాట చెబుతోంది. దీంతో గగన్‌ వ్యవహారం అనుమాస్పదంగా మారింది. మరి దీనికి అతనేమంటాడో చూడాలి.


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus