సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యులందరూ సెలబ్రిటీలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు. వారికి హాయ్ చెప్పడం, మనస్ఫూర్తిగా ఓ మంచి పోస్ట్ పెట్టి.. వారిని విష్ చేస్తూ.. వాళ్ళు కూడా లైక్ కొట్టి షేర్ కొట్టుకుంటారు.. లేదా కామెంట్ చేస్తారు.ఓ సెలబ్రిటీ నుండి ప్రేక్షకులు ఇలాంటివి కోరుకుంటే ఎటువంటి తప్పు లేదు. కానీ కొంతమంది హద్దులు మీరి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. అంతేకాదు వారి పై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇంకా వాళ్ళ రాక్షసత్వం శాంతించకపోతే.. ఏకంగా ఆ సెలబ్రటీలు చనిపోయినట్టు పోస్టులు పెట్టి వాళ్ళను మనోవేదనకు గురిచేస్తున్నారు.
ఇప్పుడు కూడా అదే జరిగింది. ఓ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఓ వ్యక్తి హ్యాక్ చేశాడు. ఆ వెంటనే ఆ హీరోయిన్ చనిపోయింది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. కొద్దిసేపటికే ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది. ఇది ఆ హీరోయిన్ కు వెంటనే తెలీలేదు. ఆలస్యంగా తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆ పోస్ట్ ను చూసి షాక్ కు గురయ్యింది. వెంటనే అప్రమత్తమై తన ఫేస్బుక్ ని ఎవరో హ్యాక్ చేసినట్లు ప్రకటించింది. ఆ నటి మరెవరో కాదు పంజాబీ నటి నికిత్ ధిల్లోన్. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తి…
‘మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు ఆ హ్యాకర్. దీని పై నిఖిత్ స్పందిస్తూ..”ఈ పోస్ట్ చూసి ఎంతో మనోవేదనకు గురయ్యాను. చాలా భయంకరమైన పరిస్థితి అది. నా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదన అనుభవించారు. ఇది పబ్లిసిటీ స్టంట్ కోసం అని కొంతమంది అంటున్నారు. కానీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మా అమ్మమ్మ అయితే భటిండాలో నివసిస్తుంది.
ఆ పోస్ట్ చూసి ఎవరో మా అమ్మమ్మకు ఫోన్ చేసి నేను చనిపోయానని చెప్పారట. దీంతో ఆమె షాక్ కు గురై మా అమ్మని పిలిచి చాలా ఏడ్చింది. ఆమె మానసికంగానూ కృంగిపోయింది. మేమంతా జరిగిన విషయం ఆమెకు చెప్పినా ఆమె నమ్మలేదు. ఆమె వయసు పెద్దది కాబట్టి ఈ విషయాన్ని దాచిపెడుతున్నట్టు ఆమె ఫీల్ అయ్యింది. హ్యాకింగ్ గురించి, సోషల్ మీడియా గురించి ఆమెకు తెలీదు. తర్వాత రోజు నేను ఆమెతో ఫోన్ లో మాట్లాడితే కానీ ఆమె ఆ బాధ నుండి కోలుకోలేదు.అప్పుడు కూడా చాలా ఏడ్చింది’ అంటూ నికిత్ చెప్పుకొచ్చింది.