రోగాలకు సెలబ్రిటీలు ఏమీ అతీతం కాదు. కాకపోతే వాళ్ళు కాస్ట్ లీ ట్రీట్మెంట్ లు తీసుకుంటారు కదా.. వాళ్ళ దగ్గర డబ్బుంది కాబట్టి ఎలాగైనా బ్రతికి బయటపడతారు అనుకుంటే పొరపాటే..! అందుకు చాలా ఉదాహరణలు మనం చూశాం. తారకరత్న ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు కోట్లల్లో ఖర్చు పెట్టారు… కానీ అతని ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు. సెలబ్రిటీలు అయినా, సామాన్యులు అయినా.. రోగాన్ని ఆరంభ దశలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.
సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం.. ఓ టాలీవుడ్ హీరోయిన్ ఇటీవల ఓ అరుదైన వైరస్ భారిన పడిందట.ఆమెనే దెబీనా బోనర్జి. ఈమెకు ‘ఇన్ఫ్లుఎంజా బి’ అనే అరుదైన వైరస్ సోకిందట. ఈ వైరస్ ఎవరికైతే సోకిందో వారు చిన్న పిల్లలకు దూరంగా ఉంటే మంచిదని ఈమెకు వైద్యులు తెలిపారు.ఇటీవల ఈమె తన భర్త పిల్లలతో కలిసి.. శ్రీలంక వెకేషన్ కి వెళ్ళింది. అక్కడి నుంచి తిరిగొచ్చాక..ఈమెకు జలుబు, జ్వరం వచ్చింది. వాతావరణ మార్పు వల్ల వచ్చి ఉండొచ్చు అని ఈమె లైట్ తీసుకుంది.
అయితే జ్వరం ఎంతటికీ తగ్గకపోయే సరికి మెడికల్ టెస్టులు చేయించుకుంటే ‘ఇన్ఫ్లుఎంజా బి’ వైరస్ సోకినట్టు ఈమెకు తెలిసింది. ప్రస్తుతం ఈమె తన పిల్లలకు దూరంగా ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకుంటుంది.తాను మెల్లమెల్లగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారట. అలాగే కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది.
ఇక దెబీనా బోనర్జి.. ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘సిక్స్’ అనే చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత ‘రామాయణం’ సీరియల్ లో సీత క్యారెక్టర్ పోషించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక రామాయణంలో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరిని ఈమె ప్రేమించి పెళ్ళాడింది.