మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు 20 సినిమాల్లో నటించిన ఈమె తన అందంతో, నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె చాలా టాలెంటెడ్. సెలెక్ట్ చేసుకునే పాత్రలు కూడా చాలా బాగుంటాయి. కొన్ని చాలా బోల్డ్ గా కూడా ఉంటాయి. అందుకే ఈమెకు హిందీ నాట ఫ్యాన్స్ ను సంపాదించుకోగలిగింది.’తను వెడ్స్ మను’ ‘చిల్లర్ పార్టీ’ మొదలగు విజయవంతమైన చిత్రాల్లో ఈమె నటించి మెప్పించింది.

అంతేకాదు బుల్లితెర పై కూడా పలు టీవీ షోలలో కూడా సందడి చేసింది. అయితే ఇటీవల చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఈమె అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పొలిటీషియన్ ను అయిన అహ్మద్ ఫహద్ ని పెళ్లాడింది.నిజానికి అతన్ని మొదట ఈమె సోదరుడి అంటూ పలు సార్లు చెప్పుకొచ్చింది. అందుకే వీరి పెళ్లి విషయాన్ని మొదట ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. మీడియా కూడా ఫోకస్ పెట్టకుండా చేయగలిగింది.

జనవరి 6న స్వర భాస్కర్ -అహ్మద్ ఫహద్ లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత తమ బ్యూటిఫుల్ మెమోరీస్ ను ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది స్వరభాస్కర్.ఇక వీరి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. హనీమూన్ బెడ్ ను తన తల్లి గులాబీలతో అలంకరించింది అంటూ ఆమె ఈ ఫోటోలను తన శోభనం గది ఫోటోలను షేర్ చేసింది.

అయితే ఈ జంట ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారట. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి.. ఈసారి వీరి కుటుంబ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారట. మార్చి 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరగబోతుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది స్వరభాస్కర్.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus