ఆ హీరోయిన్ విషయంలో యశ్ అలా ప్రవర్తించారా?

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో యశ్, శ్రీనిధి శెట్టి ప్రేక్షకులకు దగ్గరయ్యారనే సంగతి తెలిసిందే. శ్రీనిధి శెట్టిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. అయితే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న ఉమైర్ సంధు తాజాగా యశ్, శ్రీనిధిశెట్టి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనిధిశెట్టిని యశ్ వేధించాడంటూ ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. ఉమైర్ సంధు కేజీఎఫ్ సెట్ లో యశ్ శ్రీనిధిని వేధించాడని యశ్ తో ఇంకెప్పుడూ పని చేయాలని అనుకోవడం లేదని అతను ఒక టాక్సిక్ అని వేధించే మనిషి అని శ్రీనిధి చెప్పినట్టు ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో శ్రీనిధి శెట్టి స్పందిస్తూ సోషల్ మీడియాను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఇతరులపై బురద చల్లడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులకు కూడా నేను ప్రేమను అందిస్తున్నానని శ్రీనిధి చెప్పుకొచ్చారు. నా లైఫ్ లో ముఖ్యమైన వాళ్లకు ప్రగాఢమైన పశంసలను తెలియజేయడానికి ఉపయోగించాలని అనుకుంటున్నానని శ్రీనిధి కమెంట్లు చేశారు.

ఇలాంటి ప్రమాదకర వార్తలు రిపీట్ కాకుండా ఉండాలని శ్రీనిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేజీఎఫ్ లో నటించడం లక్కీగా భావిస్తున్నానని శ్రీనిధి పేర్కొన్నారు. యశ్ తో నటించడం గౌరవంగా ఫీలవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. యశ్ స్పెషల్ పర్సన్ అని అతను గురువు, స్నేహితుడు, జెంటిల్ మ్యాన్ అని శ్రీనిధి శెట్టి కామెంట్లు చేశారు. యశ్ నాకు స్పూర్తి అని శ్రీనిధి కామెంట్లు చేశారు. యశ్ రాకింగ్ స్టార్ అని ఆయనకు నేను ఎప్పటికీ అభిమానినే అని శ్రీనిధి అన్నారు.

శ్రీనిధి శెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీనిధి తెలుగుతో పాటు ఇతర భాషల్లో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రీనిధి కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఫ్యాన్స్ కు మరింత దగ్గరవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus