డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైపోయిన నటి..!

  • September 1, 2021 / 04:15 PM IST

డ్రగ్స్ కేసు వ్యవహారం… గతేడాది శాండల్ వుడ్ తారలను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే.పలువురు నటీమణులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ లో ఉంచడం కూడా జరిగింది. అయితే వాళ్ళు తిరిగి బయటకి రావడంతో ఈ వ్యవహారం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం తెర పైకి వచ్చింది. సంజనా గల్రాని, రాగిణి వంటి నటీమణులకు సమన్లు పంపారు బెంగుళూర్ పోలీసులు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర కీలక ఆధారాలు కూడా ఉన్నట్టు వారు తెలిపారు.ఇదిలా ఉండగా.. డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నటీమణులు కూడా ఇన్వాల్వ్ అయినట్టు రెండు రోజులుగా చర్చ జరుగుతుంది.

ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు పోలీసులు.ఇందులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో… ప్రముఖ నటి, మోడల్, కాస్మొటిక్స్ వ్యాపారి అయిన సోనియా అగర్వాల్ ప్లాట్లో సోదాలు నిర్వహించారు.సోనియా అగర్వాల్ అంటే 7/జి హీరోయిన్ కాదండోయ్. ఈమె వేరు.ఈ సోనియా ఓ కన్నడ నటి. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే… నటి సోనియా ఇంట్లో 40 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ టైములో సోనియా ఇంట్లో లేదు. ఓ హోటల్ రూమ్లో ఆమె ఉన్నట్లు సమాచారం రాబట్టిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

అయితే ఆమె వారి నుండీ ఎస్కేప్ అయ్యే ప్లాన్లు వేసింది. వాళ్ళకంట పడకుండా బాత్ రూంలో దాక్కునే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు..ఆమెని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు.ఇక విచారణలో భాగంగా డ్రగ్స్ వ్యాపారులతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నట్టు కూడా ఆమె ఒప్పుకుందట.’నైజీరియాకు చెందిన డ్రగ్స్ వ్యాపారి థామస్ తో ఆమె నిత్యం కాంటాక్ట్ లో ఉందని.. పార్టీలకు అతడు డ్రగ్స్ పంపిణీ చేస్తుంటాడని.. ఈ కేసులో ఇంకా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు’ కూడా సోనియా పోలీసులకు చెప్పింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus