అందం మరియు అభినయం ఒక హీరోయిన్ లో ఉండడం అనేది చాలా అరుదైన కాంబినేషన్. అలాంటి హీరోయిన్స్ మన సౌత్ లో చాలా తక్కువ ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఒకరే సిమ్రాన్. ఈమె తన అందాల ఆరబోతలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చెయ్యగలదు, అలాగే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరచిపోయేలా కూడా చెయ్యగలదు. తెలుగు, తమిళం భాషల్లో దాదాపుగా ఈమె అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించింది. ఇప్పటికీ కూడా ఆమె క్యారక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్ గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే సిమ్రాన్ కి అప్పట్లో చాలా అఫైర్స్ ఉండేవి అని ఇండస్ట్రీ లో టాక్ నడిచేది. అప్పట్లో ఆమె ప్రముఖ హీరో కమల్ హాసన్ తో చాలా కాలం వరకు ప్రేమాయణం నడిపి సహజీవనం చేసింది అనే టాక్ ఉండేది.
ఆ తర్వాత కొంతకాలానికి అతనితో విడిపోయి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం తో ప్రేమాయణం నడిపింది అనే టాక్ కూడా బలంగా ఉండేది. అయితే వీళ్లిద్దరి మధ్య అప్పట్లో ఒక పెద్ద గొడవ జరిగింది అట. అదేమిటి అంటే సిమ్రాన్ కి ఒక సినిమాలో హీరో తో లిప్ లాక్ సన్నివేశం ఉందట. రాజు సుందరం ఆ సన్నివేశం లో సిమ్రాన్ ని నటింపచేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అందులో హీరో కమల్ హాసన్ కాబట్టి.
కమల్ హాసన్ (Simran) సిమ్రాన్ కి మాజీ ప్రియుడు అవ్వడం, ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తే మళ్ళీ వాళ్లిద్దరూ ఎక్కడ దగ్గర అవుతారో అని అభద్రతా భావం ఉండేదట. అందుకే సిమ్రాన్ ని అలాంటి సన్నివేశం లో నటించొద్దు అంటూ పదే పదే చెప్పాడట. కానీ సిమ్రాన్ మాట వినలేదు, పెద్ద గొడవ జరిగింది అట. ఆ సమయం లో వీళ్లిద్దరు కారు లో ఉన్నారు. రాజు సుందరం కి కోపం వచ్చి, కార్ నుండి దిగిపో అని నడి రోడ్డు మీద సిమ్రాన్ ని వదిలి వెళ్ళిపోయాడట. అప్పట్లో ఈ వార్త సోషల్ కోలీవుడ్ ని ఊపేసింది.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!