సెలబ్రిటీల ప్రెగ్నెన్సీ న్యూస్, బేబీ బంప్ పిక్స్, వీడియోస్ కనిపిస్తే.. ఫ్యాన్స్, నెటిజన్స్, ఇండస్ట్రీ వర్గాల వారి విషెస్‌తో సోషల్ మీడియా సందడి సందడిగా ఉంటుంది.. తాజాగా ఓ పాపులర్ నటి బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ నటి ఇషితా దత్తా.. 2012 లో వచ్చిన ‘చాణక్యుడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. బాలీవుడ్ ‘దృశ్యం’ లో చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ కూతురుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..
మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ అయిన ‘దృశ్యం’ తమిళం, తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో డబ్ అవగా.. హిందీలో ఇషితా తన నటనతో మెప్పించింది.. అలాగే 2022 లో వచ్చిన సీక్వెల్ ‘దృశ్యం 2’ లో కూడా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది.. ఇటీవల బేబీ బంప్‌తో బాంబే ఎయిర్ పోర్ట్‌లో కెమెరాల కంట పడింది ఇషితా.. ఇన్నాళ్లకు తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు ఈ స్టార్ కపుల్.. దీంతో వీరికి విషెస్ వెల్లువెత్తుతున్నాయి..
2017 సంవత్సరంలో (Actress) ఇషితా, వత్సల్ సేథ్‌ను వివాహం చేసుకుంది.. ‘తల్లి కాబోతుండడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. అంతా కొత్తగా ఉంది.. కడుపులో ఓ బిడ్డ పెరుగుతుందంటే ఆ అనుభవమే ఎంతో డిఫరెంట్‌గా ఉంది’ అంటూ హ్యాపీగా ఫీలయింది.. ఇక ఆమె భర్త వత్సల్ సేథ్.. ‘మా పెళ్లి జరిగి 5 సంవత్సరాలవుతోంది.. కెరీర్‌లో సెటిలయ్యాక పిల్లల గురించి ఆలోచించాలనే నియమాలేవీ పెట్టుకోలేదు.. లైఫ్‌లో పెళ్లి అనేది ఎంత ఇంపార్టెంటో, పిల్లలు మన జీవితంలోకి రావడం అనేది కూడా అంతే ముఖ్యం..
పని ఎప్పుడూ ఉండేదే కానీ మన జీవితంలోకి ఓ చిన్నారి వస్తుందంటే జీవితంలో అందమైన అధ్యాయానికి తెరతీసినట్లే’ అంటే తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.. ఇక సముద్రపు ఒడ్డున భార్య బేబీ బంప్‌ని ముద్దాడుతున్న పిక్స్ అయితే ఆకట్టుకుంటున్నాయి.. ‘బేబీ ఆన్ బోర్డ్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..