ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు అయిన జయప్రద గురించి ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె కనిపించకుండా పోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారట. విషయంలోకి వెళితే.. 2019 వ సంవత్సరంలో.. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో జయప్రద నిందితురాలిగా ఉన్నారు. దీంతో కోర్టు విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు అందాయి.
అయినా ఆమె హాజరు కాలేదు. జయప్రద నిర్లక్ష్యం కారణంగా జడ్జి ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడం జరిగింది. జనవరి 10 టైంకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకి కూడా ఆదేశాలు అందాయి. అందుకే రామ్‌పూర్ పోలీసులు ఆమె కోసం తెగ వెతుకుతున్నారు. ఆమె ఆచూకీ మిస్ అవ్వడంతో ప్రత్యేక టీంని కూడా ఎస్పీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఆ బృందం కూడా జయప్రద ఆచూకీని ఇప్పటివరకు కనిపెట్టలేకపోయినట్టు తెలుస్తుంది.
మరోపక్క జయప్రద (Jayaprada) ఇలా పారిపోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఆమె క్షేమంగా ఉందా లేదా? అంటూ ఆమెను అభిమానించేవారు ఆందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జయప్రద. ఆ తర్వాత బాలీవుడ్లో కూడా సత్తా చాటింది. కానీ శ్రీదేవి రేంజ్లో సక్సెస్ కాలేదు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రాణించారు.